చూస్తూ చూస్తూ మరో మూడునెలలు ఇట్టే గడిచిపోయాయి. షరా మామూలుగానే, అవుతాయనుకున్న పనులు అవ్వలేదు. కొన్ని పనులు అయినా అప్పుడే బయటకు చెప్పడానికి వీల్లేదు. అబ్బుర పరిచే విధంగా మాత్రం ఊహించనివి కొన్ని జరిగాయి. మూణ్ణెళ్ళకోసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకోవాలని నిశ్చయించుకున్నాను కాబట్టి, జూలై-సెప్టంబర్ వరకూ జరిగిన కొన్ని హై-లైట్స్ ఆండ్ లో-లైట్స్.
*****
రచనా వ్యాసంగం – ఆరోగ్యం
రచనా వ్యాసంగం కొనసాగించడానికి అన్నింటికన్నా ముఖ్యమైంది తీరిక, సావకాశం అనుకుంటూ ఉన్నా కానీ, మానసిక-శారీరక ఆరోగ్యం అత్యంత కీలకమని నాకు గత ఏడాదిగానే బాగా బోధపడుతుంది. రచనా వ్యాసంగానికి ప్రయారిటీ ఇవ్వడానికి నేను మానసికంగా సిద్ధమయ్యేసరికి నేనసలు ఇంక రాసే పరిస్థితి ఉండదేమోనన్న అనుమానం గత మూడు నెలలుగా మరీ ఎక్కువైంది. నిద్రలో కూడా విపరీతమైన వేదన పడకుండాఅ ఉండడానికి సగానికి సగం పని తగ్గించాల్సి వచ్చింది. రోజులో కనీసం ఓవరాల్‍గా ఎనిమిది గంటలు ఆక్టివ్ గా ఉండడం గగనమైపోతుంది. (పధ్నాలుగు గంటలు కేవలం ఉద్యోగం మాత్రమే చేసిన రోజులెన్నో!) టైపింగ్ ఎక్కువ చేయలేకపోతున్నాను. ఈ క్వార్టరులో ఆఫీస్ పని తక్కువ ఉంది, ఎలాగో మానేజ్ చేశాను.
ఎంత సేపూ ఉరుకులు పరుగులు మీద ధ్యాసే కానీ అది మన శరీరానికీ, మనసుకీ ఎంత హాని చేస్తుందని మనం చూసుకోను కూడా చూసుకోం. కార్‍కో, ఫోన్‍కో స్క్రాచ్ పడినా విలవిలలాడిపోతాం, మనకున్న ఏకైక సాధనం శరీరం. దాన్ని మాత్రం అరగదీస్తూనే ఉంటాం.
అనారోగ్యంతో సతమతవుతూ కూడా సాహిత్య కృషిని వదిలిపెట్టలేని వాళ్ళల్లో నాకు చెకోవ్ ముందు గుర్తొస్తాడు. ఆయన ఉత్తరాల్లో (“A life in letters”: Chekhov) చాలా వివరంగా రాస్తాడు, టీ.బీ.తో రక్తం కక్కుకుంటూన్నా ఎలా రాస్తూనే ఉన్నాడో చెప్తాడు. ఎంతటి అనారోగ్యమున్నదీ స్నేహితులతో, బంధువులతో పంచుకుంటూనే ఉన్నాడు. మంటో కూడా మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా రాశాడు, అయితే మంటో రాయడం పైనే బతికిన మనిషి. రాసినవాటికి డబ్బులొచ్చిన నాడు దర్జాగా బతికాడు, లేదంటే కటిక దరిద్రం అనుభవించాడు.
“వడివాసల్” అనే తమిళ నవల రాసిన రచయిత, సి.ఎస్. చెల్లప్పన్, కాంప్లికేటెడ్ సర్జరీస్ అయి తిరిగొచ్చిన ప్రతీ సారి, “రాసుకోవడానికే జీవితం నాకు మరో అవకాశం ఇచ్చినట్టుంది” అని అనేవారట. ఆ మాట చదివిన దగ్గర నుంచీ (అంటే 2018) చివర నుంచీ నేను రాయడాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాను. నాకు తెలిసిన ఒకరు కూడా, ప్రస్తుత తీవ్ర అనారోగ్యంతో ఉన్నా కూడా, లేచి కూర్చునే ఓపిక ఉన్న రోజుల్లో కొద్ది కొద్దిగా పుస్తకం ఒకటి రాస్తున్నారు. ఏదో చెప్పాలని, పంచుకోవాలన్న తపన నొప్పిని కూడా జయిస్తుందంటే ఆలోచించుకోవచ్చు, ఆ తపన ఎంత అవసరమో ఆ ఉనికికి.
నా సంగతేంటో చూడాలి మరి. ప్రస్తుతానికి డాక్టర్లు చెప్పింది చెప్పినట్టు విని, మాటిమాటికీ రెస్ట్ తీసుకోవడం తప్ప ఇంకేం చేయలేను. ఈ మూడు నెలల్లో అవుతాయన్న పనులు కూడా కాలేదని ఓ వైపు విసుగు వస్తుంది కానీ, ఒక ఆర్నెళ్ళ క్రితం సెకండ్ వేవ్ పీక్ లో ఉండగా, అసలా గండం నుంచి బయటపడగలమో లేదో అన్న భయంతో చచ్చాం కదా! అంతటి విపత్తు నుంచి బయటపడిన మనసుకి, శరీరానికి ఆ మాత్రం విశ్రాంతి కావాల్సిందే! అని నచ్చజెప్పుకుంటున్నాను ఇక!
*****
మైల్ స్టోన్: బ్లాగులో రెండొందల పోస్టులు
ఈ బ్లాగు మొదలెట్టి వచ్చే జనవరికి పధ్నాలుగేళ్ళు నిండి పదిహేనేళ్ళు అవుతుంది . ఏదో కొత్త లాప్‍టాప్ కొనుక్కున్న సంబరంలో, తెలుగులో టైప్ చేయచ్చునని తెలిసిన ఉద్వేగంలో మొదలుపెట్టిన బ్లాగ్, నన్ను ఇంత దూరం తీసుకొస్తుందనీ, ఇందరిని కలిసే అవకాశం, ఇన్ని చదువుకునే సౌలభ్యం, మనిషిగా ఎదిగే అవకాశం ఇస్తుందనుకోలేదు. 2008-2011 మధ్య ఉన్న తెలుగు బ్లాగింగ్ కమ్యూనిటీకి నేనెప్పటికీ రుణపడి ఉంటాను – మనుషులకి వ్యక్తిగతంగా కాదు, ఆ సమూహానికి మాత్రమే. నేను తెలుగులో రాసేవన్నీ ఆ రుణం తీర్చుకోడానికే. Whatever little I can give back to the community, I’ll.
ఈ బ్లాగులో ప్రస్తుతం 200 పోస్టులు ఉన్నాయి. చాన్నాళ్ళు బాగా అలక్ష్యం చేసినా మళ్ళీ బ్లాగింగ్ చేస్తున్నందుకు సంతోషం. ఫేస్బుక్ లో రాస్తున్నవి కూడా కొన్ని ఇక్కడ పెట్టచ్చు, పెట్టడం లేదు. చూడాలి.
*****
టెక్ వ్యాసాలు బిబిసి తెలుగులో…
ఇదో ఊహించని పరిణామం. తెలుగులో టెక్నాలజీకి సంబంధించినవి రాయాలని నేనెప్పుడూ అనుకోలేదు. గత రెండు మూడేళ్ళుగా లీలగా అనిపించింది, టెక్ మన జీవితాలని మార్చేస్తున్న విధానం గురించి డిస్కోర్సు జరగాలని, కానీ అంతకు మించి ఆలోచించలేదు. టెక్నాలజీలో పని చేస్తున్న తెలుగు రచయితలు చాలా మందే ఉన్నారు. అయినా ఈ అవకాశం నా దగ్గర వరకూ రావడం అపురూపంగా అనిపించింది.
నా కోలీగ్స్, ఫ్రెండ్స్ మాత్రం నాకన్నా ఎక్కువ సంబరపడిపోతున్నారు. నాక్కూడా ఇవి రాయడం భలే నచ్చుతోంది. కొన్ని concepts నాకూ కొత్తే! వాటి గురించి చదివి, వివరాలు సేకరించడం మంచి exercise. రాయాలనుకుంటున్న అంశం తెలిసినా తెలియకపోయినా దాన్ని ఎలా చెప్పాలి, అటు complicate చేయకుండా, ఇటు misleadingly oversimply చేయకుండా రాయాలి అన్నది మెల్లిమెల్లిగా బోధపడుతుంది. మామూలుగా “explain xyz concept like you’re explaining to a 8 yr old” లాంటి ప్రశ్నలు టెక్ ఇంటర్వ్యూలలో కూడా అడుగుతుంటారు. నేనైతే ఈసారి ఇంటర్న్స్ కి “explain the concept in your own language” అని టాస్క్ ఇచ్చేట్టున్నాను. ఇంగ్లీషులో మనం ఎన్ని పదాలని taken for granted గా తీసుకుంటాం, వాటిని వేరే భాషలో వివరించేటప్పుడు ఎన్ని nuances బయటపడతాయి అన్నది mind-blowing అసలు!
బిబిసి తెలుగులో డిజిహబ్ సీరీస్ లో వస్తున్న ఆర్టికల్ చిట్టా ఈ లింక్‍లో… ఇప్పటికి ఏడు వ్యాసాలు అచ్చయ్యాయి.
DigiHub: Tech Series in BBC Telugu
సైబర్ స్పేసులో మహిళా రచయితలు: లెక్చర్
ఫేస్బుక్ లో ఆక్టివ్ గా ఉండడం దండగ పని అనిపిస్తుంటుంది ఒక్కోసారి. కానీ ఇలాంటి అవకాశాలు ఎదురైనప్పుడు “ఆక్టివ్ గా లేకపోయుంటే ఇవి వచ్చేవా?” అని కూడా అనిపిస్తుంటుంది.
తెలుగులో పాతిక కథలు రాసినా, వాటిలోనూ ఫెమినిజం ఛాయలు పుష్కలంగా, “ఫెమినిస్ట్” అన్న లేబుల్ నాకు అతకలేదు కానీ ఫేస్బుక్ లో రాసే పోస్టుల వల్ల మాత్రం “ఫెమినిజం” అనగానే నేనూ గుర్తొస్తున్నాను. ఈ సమావేశంలో పాల్గొనే అవకాశమే కాకుండా ఇంకొకరు కూడా తమ యూనివర్సిటీ తీసుకురాబోయే పుస్తకం కోసం (ఇంగ్లీషులో) పేపర్ రాయమన్నారు. విధి యాడు వింత నాటకములు, అంటే ఇదే! 😉
మొత్తానికైతే ఒక గంట సేపు “సైబర్ స్పేసులో మహిళా రచయితలు” అని ఒక గంట లెక్చర్ ఇచ్చాను. అదీ తెలుగులో! I was nervous like crazy, but my friends were around to hold me. టాక్‍కి ముందు ఒక సర్వే నిర్వహించాను. దానికీ, టాక్‍కీ కూడా స్పందన నేను ఊహించినదానికన్నా బాగా వచ్చింది. నేను ఎన్నుకున్న అంశం మరీ కొత్తగా ఉంటుందేమోనన్న అనుమానం పీకుతూనే ఉన్నా, దానికే స్టిక్ అవ్వడం మంచిదైంది. (టాక్ ఆధారంగా ఒక వ్యాసం రాయాలి త్వరలో)
లెక్చర్ ఉన్న యూట్యూబ్ లింక్ ఇది. ఒక నలభై నిముషాల తర్వాత నాది మొదలవుతుంది.
అన్నిసాకు స్పందన
కాలయంత్రంలో నేను రాసిన కథ గురించి మంచి స్పందన వచ్చింది/వస్తోంది. నన్ను ఊరికే “ఇంగ్లీషు పదాలు ఎక్కువుంటాయి, మీ కథల్లో” అని అంటుంటారు, అవి సందర్భానుసారంగా వాడినా కూడా. ఇంగ్లీషు మీద ఇష్టం ఉన్నా లేకున్నా అందరం వాడతాం. ఉర్దూ అలా కాదు. భాషా రాదు, ఒక రకమైన అయిష్టతా ఉంది. (“తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాదులో తెలుగు వినిపించకుండా ఉర్దూ గోలేంటి?” అని విసుక్కునే జనాభాని బాగా చూసి ఉన్నాను.) అయినా కూడా కథని బాగా ఆదరించారు. అట్లాంటి ఆదరణలు గట్రా నాకూ కొత్త. అందుకే స్పందనలు ఒక చోట పెట్టుకున్నాను.
https://aksharf.com/2021/08/12/annisa-responses/
పుస్తకం.నెట్ లో మళ్ళీ ఆక్టివ్
ఎక్కువ టైపింగ్ చేయలేకపోతున్నా కాబట్టి రెస్ట్ తీసుకునేటప్పుడంతా పుస్తకాలు చదువుకుంటున్నా. అందువల్ల బండి కొంచెం వేగంగానే సాగింది. రాయాల్సినవి ఇంకా ఉన్నాయి కానీ, రాసినవీ తక్కువేం కాదు. అదో పుస్తకం, ఇదో పుస్తకంలా కాకుండా ఒక సీరీస్ గా రాయాలని ప్రయత్నిస్తున్నాను. వాటిల్లో:
- Sanskrit Drama Lecture Series: ఇప్పటికి నాలుగు రాశాను. వచ్చే నెలలో ఇంకా రాస్తాను. http://pustakam.net/?tag=borilectures_sanskritdrama
- కె.ఆర్.మీరా అనువాద రచనలు: ఇంగ్లీషులో ఉన్న ఆవిడ అన్ని రచనలూ చదివాను, ఇంకా ఓ మూడింటి గురించి రాయాలి. రాసినవి ఈ లింకులో: http://pustakam.net/?tag=krmeera
- భారతీయ సాహిత్యం అనువాదంలో: ఒక లిస్ట్ చేసుకున్నా ఇలా. మెల్లిమెల్లిగా చదివి, రాస్తాను. https://aksharf.com/2021/07/15/hitchhiking-through-great-indian-fiction/
మీమో, మీమున్నరా…
పుస్తకం.నెట్ కి కొత్తవాళ్ళతో ఎలా రాయించాలో నాకు అర్థం కావడం లేదు. డెస్పరేషన్లో మీమ్ ఒకటి చేసి పెట్టాను, మన్మథుడు మీమ్ టెంప్లేట్ తో. ఇప్పటికో పది చేసుంటా… వ్యాసాలు ఏం పెరగలేదు, మీమ్స్ కి లైక్స్ అవీ ఏం ఎక్కువ రావడం లేదు, అయినా మనిషి అన్నాక ప్రయత్నం చేయాలి కదా! కొన్ని షేర్ చేస్తున్నాను ఇక్కడ, సరదాకి…








భాషా సాధన
ఒక కొత్త కన్నడ నవల పూర్తి చేసి పరిచయం చేశాను, పుస్తకం.నెట్ లో. ఉర్దూ సాధన
“నడుస్తోంది… నడుస్తోంది…” టైపులో పాసెంజరు బండిలో “ప్యాసా కవ్వా” దాకా వచ్చింది… రాజధాని వేగంతో ఎప్పటికి ఉర్దూ సాహిత్యం చదవగలనో ఏమిటో…
అన్నీ కుదిరితే వచ్చే పోస్టులో కొన్ని భారీ న్యూసులే ఉండే అవకాశం ఉంది. Hope things will work out in my favour. Thanks for reading. 🙂