DigiHub: Tech Series in BBC Telugu

Posted by

బిబిసి తెలుగు కోసం #డిజిహబ్ సీరిస్‍లో వచ్చిన వ్యాసాలు:

 1. 2nd Jul 2021: అంతర్జాలమందు అనుమానించువాడు ధన్యుడు, సుమతీ (Introduction)
 2. 16th Jul 2021: మెటాడేటాలోనే ఉంది మతలంబంతా: స్మిషింగ్ ( Mobile phishing – Smishing)
 3. 31st Jul 2021: మీకు తెలీకుండా మీ ఫోన్‍లో దూరే దొంగలు (Mobile Malware – Pegasus)
 4. 16th Aug 2021: స్మార్ట్ హోమ్: ఈ ఇంట్లో కాఫీ మెషీన్ దానంతట అదే కాఫీ తయారు చేస్తుంది, లైట్ దానంతట అదే వెలుగుతుంది (Smart Homes, Home Automation)
 5. 4th Sep 2021: వి.పి.ఎన్ అంటే ఏమిటి? కేంద్ర ప్రభుత్వం దీన్ని నిజంగానే బాన్ చేయాలనుకుంటోందా? (VPN & Its ban in India)
 6. 10th Sep 2021: ఆత్మహత్య ఆలోచనలను టెక్నాలజీ సాయంతో పసిగట్టవచ్చా? ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవచ్చా? (Technology’s role in suicide prevention. #worldsuicidepreventionday)
 7. 25th Sep 2021: కళ్ళజోడే ఇక స్మార్ట్ ఫోన్ (Augmented Reality – Smart Glasses)
 8. 10th Oct 2021: Mental Health: వర్చువల్ రియాలిటీతో మానసిక అనారోగ్యానికి చికిత్స (Virtual Reality – Mental Health. #worldmentalhealthday)
 9. 17th Oct 2021: ఐటీ ఆక్ట్-2000: మారుతున్న టెక్నాలజీకి తగ్గట్లుగా చట్టాలు మారుతున్నాయా? (On #digitalsocietyday, about Information Technology Acts in India)
 10. 31st Oct 2021: వాట్సాప్ స్కాములతో జాగ్రత్త (WhatsApp scams and precautions)
 11. 21st Nov 2021: మెటావర్స్ – ఇంటర్నెట్ లో మాయాబజార్ (Intro to metaverse)
 12. 28th Nov 2021: బ్లాక్ చెయిన్: బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీలను నడిపించే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? (Intro to Blockchain internal workings)

******

పుస్తకాలు, సినిమాలు, నాటకాలు గురించి కాకుండా నేను రాయాలనుకున్నవి, ముఖ్యంగా తెలుగులో, స్పోర్ట్స్ మీద. ఆటలకి సంబంధించిన వార్తలు తప్పించి మన దగ్గర పెద్ద స్పోర్ట్స్ మెటీరియల్ లేదు. అది కాక, మెంటల్ హెల్త్ గురించి రాయాలి/రాయించాలి అనుకున్నాను. కానీ నా వృత్తి అయిన టెక్నాలజి గురించి కూడా నేను రాయచ్చు, అసలు తక్కినవాటికన్నా నాకు ఎక్కువ ప్రవేశం ఉంది అందులోనే కదా అన్నది తట్టలేదు, బిబిసి తెలుగు తరఫున ఫ్రెండ్ ఆలమూరు సౌమ్య ఫోన్ చేసేవరకూ.

కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల అనుకున్నదానికన్నా కాస్త ఆలస్యంగా మొదలైనా చూస్తూ చూస్తూ అప్పుడే నాలుగు వ్యాసాలు అయ్యాయి. ఈ సీరీస్ లో ఆర్టికల్స్ అన్ని ఒక చోట ఉంటే పంచుకోడానికి తేలిగ్గా ఉంటూందని ఇద్దరు, ముగ్గురు అడిగారు. అందుకని ఇక్కడ చేర్చి పెడుతున్నాను. పైగా నాక్కూడా వెనక్కి తిరిగి చూసుకోడానికి వీలుగా ఉంటుంది.

పోయినేడాది కొందరి స్నేహితులతో తెలుగులో ఎలాంటి పనులు చేయచ్చు అని బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నప్పుడు “ఏది మొదలెట్టాలన్నా ఒక వెబ్సైటో, ఫేస్‍బుక్ పేజో కావాలి. మళ్ళీ దాని అడ్మిన్ బాధ్యతలూ చూసుకోవాలి… అంత ఓపిక లేదింకా” లాంటి ఆలోచనలు వచ్చి అనుకున్నవన్నీ మరుగునపడిపోయాయి. మూడు నెలలు తిరక్కముందే టెక్నాలజి గురించి బిబిసి తెలుగు అంతటి ప్లాట్‍ఫారం మీద రాసే అవకాశం దొరకడం నా అదృష్టం.

ఇవి చదివి జనాలకి ఎంత అవగాహన పెరుగుతుందో నాకు తెలీదు కానీ నాకు మాత్రం చాలా లోతుగా తెలిసిన టెక్ అంశాలని ఇలా తెలుగులో, వ్యవహార భాషలో రాయడం గొప్ప అనుభవం. ఎంత చెప్పాలి, ఎక్కడ ఆపాలి, ఎలా చెప్పాలి లాంటి మీమాంశలు చాలా నేర్పిస్తున్నాయి. అంతకన్నా ముఖ్యంగా, “ఆ… పూర్ణిమ ఏదో రాస్తుంటుందట, అదో పిచ్చి… కానీలే” అని అనుకునే టెక్-స్నేహితులు (కలిసి ఉద్యోగాలు చేసిన/చేస్తున్నవారు), ఈ సీరిస్ రాస్తున్నందుకు మాత్రం తెగ మురిసిపోతున్నారు. అబ్బురంగా చూస్తున్నారు. ఫైనల్లీ, నేనేదో పనికొచ్చే పనిచేస్తునాన్న ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఆండ్ ఇట్ మీన్స్ ఏ వరల్డ్ టు మీ!

One comment

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s