Introducing haroof in ఊహలన్నీ ఊసులై


I'm mighty thrilled with this development! A couple of years ago, when I was looking for a domain name for this blog, I was obsessed with the word "aksharam". In its unadulterated form, domains were exorbitantly costly. Unwilling to let it go the word totally, I came up with the jugaad - aksharf! (Harf means... Continue Reading →

కెరీర్ ఓరియంటడ్ మాన్


First published in Sept 2020: https://eemaata.com/em/issues/202009/23567.html మగత నిద్రలో తొడల మధ్య ఏదో కదులుతున్నట్టు అనిపించేసరికి ఉలిక్కిపడి సీటులో కదిలాడు సందీప్. పక్కనున్న పెద్దావిడ కూడా కాస్త కదిలి, మళ్ళీ సర్దుకుంది. ఆవిడ పనేనని అర్థమవుతున్నా సందీప్‌కి ఏం చేయాలో తోచలేదు. ఆల్రెడీ వెనుక సీటులో ఓ ఆడమనిషి తన భారీకాయం నెపంతో పక్కనున్న అతడి మీద పడిపోతూ, రాసుకుంటూ పూసుకుంటూ ఉంటే భరించలేక డ్రైవర్ మేడమ్‌ని దీనంగా వేడుకుంటే ఈ సీటులోకి మార్చింది. “ఈ... Continue Reading →

ఒక అల్ట్రా ఫిజూల్ కథ


https://eemaata.com/em/issues/202101/24941.html ‘రారాదూ మాచ్ చూడ్డానికి? వరస్ట్ కేసులో కూడా సచిన్ రెండుసార్లు వచ్చి వెళ్తాడు క్రీజ్‌కి…’ అని అతడు కాల్‌క్యులేషన్స్‌తో ఊరించలేదు. ఆమె వీక్ పాయింట్ మీద కొట్టలేదు. నెపమంతా అతడి మీద వేయడం కాకపోతే, అతడే ముందు అడగాల్సిన అవసరమేం లేదు. హైదరాబాద్‌కి బెంగళూరు ఎంతో దూరమేమీ కాదు, బస్సు ఎక్కితే ఒక రాత్రి ప్రయాణం, విమానమెక్కితే నాలుగైదు గంటలంతే! ‘అమ్మో… ఒక్కదాన్నే వెళ్ళాలా?’ అన్న భయాలు ఆమెకి లేవు. ‘అబ్బా… క్రికెట్ ఏం చూస్తాంలే... Continue Reading →

Learning Spaces: An experience report


శాంతా గోఖలే “అవినాష్” అనే నాటకం 1988లో రాశారట. అందులో ఒక యువకునికి మానసికపరంగా ఏదో కండిషన్ ఉంటుంది, అందుకని ఇంట్లోవాళ్ళు ఆయణ్ణి కట్టి ఒక గదిలో పెడతారు, డాకర్లకి చూపించకుండా. నిన్న జరిగిన ఒక ఇంటర్వ్యూలో శాంతగారిని ఒకరు అడిగారు, “సాహిత్యం సమాజం మీద చూపే ప్రభావం ఎలాంటిది?” దానికి ఆవిడ చాలా animated అయిపోతూ, తల అడ్డంగా ఆడిస్తూ ఇలా అన్నారు:  “నాటకం చూడగానే తల్లిదండ్రులు ఎవరైనా ఇంటికి పరిగెత్తుకెళ్ళి ఇలాంటి సమస్యలున్న వారిని... Continue Reading →

A masterclass in how they suppress your writing and how you hit back!


ఎందుకు ఇది? ఇదేదో ఒక్కళ్ళు అన్నారని తిక్కరేగి రాయాల్సి వచ్చింది కాదు. ఎప్పట్నుంచో సుడులు తిరుగుతున్న ఆలోచనలు. ఒకటే జోరీగల నస ఎంత కాలం భరిస్తాం, ఎవరమైనా? "ఆమెకి క్రాఫ్ట్ మీద అతి-శ్రద్ధ", "కథకన్నా క్రాఫ్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది", "ఆ... మీకు తెల్సా ఆమె వర్క్ షాపులూ, కోర్సులూ చేస్తుంది తెల్సా రాయడానికి", "బాగా పొగరమ్మా మనిషికి, బా చదువుకున్నాననీ!" లాంటి మాటలు పడీపడీ ఉన్నాను నాతోటి వాళ్ళతో. ఏళ్ళు గడుస్తున్నాయి కాబట్టి కొత్త బాచ్‍లు రాస్తున్నారు.... Continue Reading →

విషయం సూటిదే కానీ… : కున్‍వర్ నారాయణ్


కవి: కున్‍వర్ నారాయణ్మూలం: బాత్ సీధీ థీ పర్ (హిందీ)అనువాదం: పూర్ణిమ విషయం సూటిదే కానీ ఒకసారి భాష అనే చట్రంలో కొంచెం వంకరపోయి ఇరుక్కుపోయింది దాన్ని దక్కించుకునే ప్రయాసలో భాషను ఉల్టాసీదా చేసి విరిగొట్టి మెలిపెట్టి తిప్పి తిరగేశాను విషయం చెప్పడమన్నా జరగాలి లేదా భాషనుంచి అది బయటకన్నా రావాలి కానీ వీటివల్ల భాషతో పాటుగా విషయం కూడా పేచీ పెడుతూ పెంకిదైపోయింది. ఈ కష్టాన్నంతా ధైర్యంగా ఎదుర్కోకుండా నేను స్క్రూని విప్పకుండా దాన్నింకా బిగించేసేట్టు... Continue Reading →

తక్కిన కవిత


ఆకులపై నీళ్ళు పడ్డాయికి ఉన్న అర్థం నీళ్ళపై ఆకులు పడ్డాయికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనది జీవితాన్ని పూర్తిగా పొందడానికీ పూర్తిగా ఇచ్చేయడానికీ మధ్య ఒక నిండైన మృత్యు చిహ్నం ఉంటుంది తక్కిన కవిత పదాలతో రాయబడదు అస్తిత్వాన్ని మొత్తం గుంజి ఒక విరామంలాగా ఎక్కడో చోట విడిచివేయబడుతుంది. కవి: కు‍న్‍వర్ నారాయణ్ మూలం: బాకీ కవిత (హిందీ) అనువాదం: పూర్ణిమ

Missing – అగుపడనోడి పోలిక: Kunwar Narayan


కవి: కున్‍వర్ నారాయణ్ మూలం: లాపతా కా హులియా (హింది) అనువాదం పూర్ణిమ అగుపడనోడి పోలికలు రంగు గోధుమ హంగు రైతులెక్క నుదుటిమీద గాయమైనట్టు మచ్చ ఎత్తు ఐదడుగులకంటే తక్కువైతే కాదు మాట్లాడతడు ఏ చింతా లేనట్టు నత్తోడు వయసు అడిగితే వేల ఏళ్ళకన్నా కాస్త ఎక్కువే అంటడు పిచ్చోని లెక్క కొడతడు - కానీ కాదు ఎత్తులనుంచి పడి బొక్కలు ఇరగొట్టుకున్నాడు, మస్తు సార్లు అందుకే, చూడ్డానికే అతికించినట్టుంటడు హిందుస్తానీ నక్షా లెక్క! Missing Color... Continue Reading →

New Books – కొత్త పుస్తకాలు: Kunwar Narayan


New books, at first from a distance stare at me with a shyness Then, shrugging off any hesitation they sit and spread in front of me, on the table I read The first introduction... touch with the thrill of a handshake a beginning... they open up slowly page by page intense proximity Some become friends... Continue Reading →

అయోధ్య, 1992


హే రామ్, జీవితం ఒక కఠనమైన యదార్థం నువ్వేమో ఓ మహాకావ్యం నీవల్ల కాదులే ఈ అవివేకంపై విజయం దానికి పది కాదు, ఇరవై కాదు ఉన్నాయిప్పుడు లక్షల్లో తలలు, లక్షల్లో చేతులు విభీషణుడు ఇప్పుడు ఎవరి వైపునున్నాడో మరి ఇంతకన్నా పెద్ద ఏం జరుగుతుందిలే మన దౌర్భాగ్యం ఒక వివాదాస్పదమైన స్థలానికి పరిమితమై పోయింది నీ సామ్రాజ్యం అయోధ్య ఇప్పుడు నీ అయోధ్య కాదు యోధుల లంక అది, ’మానస’ నీ ’చరితం’ కాదు ఎన్నికల... Continue Reading →

చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా


First published in navatarangam.com on Dec 19th, 2011. గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని,  తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని,... Continue Reading →

ఈ ’కథ’ చూసారా?


ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏ నీతులు... Continue Reading →

మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’


గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం జరిగింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసింది. వికీలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమైపోయింది. ఆ సినిమా... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: