చష్మ్-ఎ-బద్దూర్’ – ఒక ఈలపాట లాంటి సినిమా


First published in navatarangam.com on Dec 19th, 2011. గడపదాటుతూనే చూపుడు వేలుకి తొడిగిన కీచెయిన్‍ను గిరగిరా తిప్పుతూ, ఈల అందుకొని,  తెరచిన గేటును అశ్రద్ధగా వదిలేసి, బైక్ ఎక్కి కూర్చొని, నుదుటిపై పడుతున్న జుట్టు అలక్ష్యంగా వెనక్కి తోస్తూ, విలాసంగా బైక్ స్టార్ట్ చేసి, దాని దడ్-దడ్-దడ్ శబ్ధంలో కూడా ఈలను ఆపకుండా దూసుకుపోతూ, దారిన ఎవరన్నా అమ్మాయి కనిపించగానే కాస్త నిదానించి, జుట్టును సవరించుకొని, ఒకసారి ముఖారవిందాన్ని బైక్ అద్దంలో చూసుకొని, నవ్వుకొని,... Continue Reading →

ఈ ’కథ’ చూసారా?


ముళ్ళపూడి వారి బుడుగుంగారు కథ చెప్పడానికి ఉపక్రమించే ముందే నీతి సెలవిస్తారు. ఎప్పుడోకప్పుడు చెప్పుకోవలసినదే కదా, ముందు ’నీతి’ అనేసుకుంటే అలా పడుంటుంది కదా, అని. మరే! కథ అన్నాక నీతంటూ ఉన్నాక చెప్పుకోవాలిగా. ఫలానా కథలో ఫలానా వాళ్ళ మధ్య ఫలానా సంఘటనలు జరిగినప్పుడు, ఫలనా అవుతుంది, దాన్ని బట్టి మనకు ఫలనా నీతి బోధపడుతుంది. మరి ఇలాంటి ఓ ఫలానా కథను తీసుకొని మనుషులకు, మారుతున్న పరిస్థితులకూ అన్వయిస్తే ఏమవుతుంది? అప్పుడు ఏ నీతులు... Continue Reading →

మనిషి లోతుల్ని చూపే ’స్పర్ష్’


గత మూడు రోజుల్లో సాయి పరాన్‍జపేతీసిన మూడు విభిన్న చిత్రాలు చూడ్డం జరిగింది. వాటిలో, ఆవిడకు జాతీయ ఉత్తమ చిత్రం అవార్డునే కాక ఎనలేని గుర్తింపునీ సంపాదించి పెట్టిన సినిమా, ’స్పర్ష్’ ఒకటి. నసీరుద్దీన్ షా, షబానా ఆజ్మీ తారాగణం అని నేను ప్రకటించగానే మా అమ్మ “అయితే, కొంచెం ఓపికతో చూడాల్సిన సినిమా అయ్యుంటుంది.” అని అనేసింది. వికీలో చిత్ర వివరాలు చూస్తే కొంచెం భారీ సబ్జెక్ట్ ఉన్న సినిమా అని వెంటనే అర్థమైపోయింది. ఆ సినిమా... Continue Reading →

Sai Paranjpye’s Saaz


“Human relationships are my forte,” అని ఉద్ఘాటించగల  ప్రతిభావంతురాలైన ఓ దర్శకురాలు, సినీ వినీలాకాశంలో నేపథ్యగాయనీమణులుగా తారాస్థాయిని చేరటానికి ఇద్దరి తోబుట్టువుల మధ్య జరిగిన అప్రకటిత స్పర్థను తెరపై ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది? సాయి పరాన్‍జపే ’సాజ్’లా ఉంటుంది. సంగీతభరితమై మనసు లోతుల్ని చూపేదిగా  సాగుతుంది. కళాకారుల్లోని మానవీయ కోణాలకు అద్దం పడుతుంది. కళ మనిషిని ఎంత ఉన్నతస్థాయికి తీసుకెళ్ళినా, మనిషి మనిషిలా మిగలడానికి మరెన్నో కావాలని గుర్తుచేస్తుంది. కథ:సినిమా మొదలయ్యే సరికి బన్సి (షబానా... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: