Writing & Loneliness
ట్రెక్ చేసేటప్పుడు, రాసేటప్పుడు మన మధ్యస్థ క్షేత్రపు స్పృహకి ఎక్కువ ఆస్కారం ఉండదు. ఏ రాయి మీద అడుగేస్తే మన బాలెన్స్ నిలుస్తుంది అన్నంత ప్రాథమికమైన నిర్ణయాలు అడుగడుక్కీ తీసుకుంటుంటాము కాబట్టి, ఒక్కో పదాన్ని తరిచి చూసుకుంటూ వాక్యం తర్వాత వాక్యం రాసుకుంటూ పోతుంటాం కాబట్టి రాయడమనేది ఇన్నర్ జోన్‍లోనే జరుగుతుంది అని నాకనిపిస్తుంది. అయితే ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నది మాత్రం మిడిల్ జోన్‍లోనే జరిగే పనే! The non-writing part of writing (conceptualization) happens in the middle zone, but the very act of writing (creation) is in the inner zone! అని నాకు బలంగా అనిపిస్తుంది. నిపుణులు కాదనచ్చు, కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. రైటర్స్ బ్లాక్ అంటే మనం ఆ ఇన్నర్ జోన్‍లోకి వెళ్ళలేక మిడిల్ జోన్‍లోనే కొట్టుకోవడం అని అర్థం చేసుకోవచ్చు.