నా క్షణాలు


మొన్న ఎవరో, "అబ్బో.. నువ్వు చాలా సీరియస్ మనిషివి. కాంప్లికేషన్స్ ఎక్కువ!" అనే సరికి మనసు చివుక్కుమంది ఒక్క క్షణం. ఆ మనిషి అలా అనడానికి కారణం తెలీగానే మాత్రం నవ్వాగలేదు. నేను నవ్వుతున్నానన్న విషయం గ్రహించిన మరుక్షణం మరో జ్ఞాపకం కళ్ళముందు కదలాడింది. ఆ మొన్నకు మొన్న మరెవరో, "మీరు చాలా సంతోషంగా గలగలాడుతూ ఉంటారు" అని అంటే, "అబ్బే లేదండీ! మీరు నన్ను చూసింది తక్కువ కాబట్టి అలా అనేస్తున్నారు కాని, నేను చాలా... Continue Reading →

జ్ఞాపకాలతో నడక


"A walk to remember" సినిమాలో హిరోయిన్ "నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!" అని చెప్పినప్పుడు హీరో మామూలుగానే విని ఊరుకుంటాడు. కానీ ఉన్నపలనా ఒక రాత్రి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద నుంచోబెట్టి, రోడ్డు పై నున్న లావాటి తెల్ల గీతకు రెండు వైపులా కాళ్ళు ఎడంగా పెట్టమని చెప్పి, అక్కడే ఉన్న బోర్డు చూపిస్తూ "చూడు.. నువ్విప్పుడు రెండు ప్రదేశాల్లో ఒకేసారి ఉన్నావు" అంటాడు. ఆ అమ్మి,... Continue Reading →

నిశ్శబ్దం


గజిబిజి జీవనం - నిదరోయిన నగరంనిశ్శబ్దంకిక్కిరిసిన స్టేడియం - ఔటయిన సచిన్నిశ్శబ్దంచెలరేగిన అల్లర్లు - నిరవధిక కర్ఫ్యూలూనిశ్శబ్దంఇంస్టెంట్ మెసంజర్ - క్రాష్ అయిన చాట్నిశ్శబ్దంకదలిపోయిన బంధువర్గం - నిర్మానుష్య శ్మశానంనిశ్శబ్దంWhy is silence so deafeningly loud!

పుస్తకం.నెట్ అట..


హే .. పుస్తకాలకి ఏదో సైట్ పెడుతున్నారట కదా?ఓ తెల్సిందా?! అవును.. పుస్తకం.నెట్ అనీ.. జనవరిలో ప్రారంభమవుతుందది.పుస్తక సమీక్షలూ గట్రా ఉంటాయా?ఊ..పుస్తక సమీక్షలూ అవీ అంటే అబ్బో బా చదివేవారికోసం కానీ..  సమీక్షలనే కాదు, పుస్తకాలతో ఏ చిన్ని అనుభవమున్నా అందులో రాసుకోవచ్చు. అనుభవాలా? అక్కడెందుకూ? బ్లాగులున్నాయి కదా!నచ్చిన పుస్తకమనో.. మెచ్చని రచననో ఆనందావేశాలలో రాసేసి బ్లాగుల్లో పెడతాం.  ఓ రెండ్రోజుల్లో అది మరుగున పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని విశ్వప్రయత్నంతో వెతకచ్చనుకోండి.. అదే కొత్త వాళ్లకయితే... Continue Reading →

Camకి చిక్కని చిత్రాలు!


గడచిన వారాంతంలో చేసిన ప్రయాణంలో డిజికామ్ అక్కరకు రాలేకపోయినా, మనోనేత్రంలో స్థిరపడిపోయిన కొన్ని ఛాయాచిత్రాలను అక్షరాలలోకి తర్జుమా చేసే ప్రయత్నం.  చూద్దామా మరి? అటో నక్షత్రమైన తీరు: మా వాళ్ళేదో కౌంటర్ వేశారు నా మీద అనిపించి పుస్తకంలో నుండి తేలి, వాళ్ళవంక రుసరుస చూద్దామని తలపైకెత్తా! తీరా చూస్తే కౌంటర్ పొట్లంలో పొగడ్త పెట్టారని గ్రహించి, నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకునేసరికి, వెన్నెలలో బయటంతా బూడిద రంగులో ఉంది. బూడిద కూడా కాదు,... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: