ప్రేమించటం కష్టం!


ప్రేమించటం కష్టం! ముడతలు పడిపోయి, ఊసురోమంటూ ఉన్న నిర్జీవమైన ఊదని బుడగను తీసుకొని దానికి ఊపిరిపోయటంతో ప్రారంభమవుతుంది కథంతా! కొన్ని సందర్భాల్లో మనకే అంత ఊపిరిచ్చే ఓపిక ఉండదు. కళ్ళముందు అది ఆకారం దాల్చుతుందే కానీ అట్టే ఎక్కువ కాలం నిలువదు. బుగ్గలు నొప్పెట్టి, ఊపిరి తిత్తులు సహకరించక మనమే వదిలేస్తాం.  ఇంకొన్ని సార్లు మనం ఊపిరినిస్తున్న కొద్దీ బుడగ పెద్దవుతూ సంతృప్తి కలిగిస్తూనే ఉన్నా, మనం కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్ళీ నీరసపడిపోతుంది. మళ్ళీ గాలిపోస్తాం.... Continue Reading →

మాట – మౌనం (వైట్ ఆండ్ బ్లాక్)


"వైట్ ఆండ్ బ్లాక్? అచ్చు తప్పు!" అని మీరనుకునే లోపు దాని పై ఓ రెండు ముక్కలు. బ్లాక్ ఆండ్ వైట్ లో బ్లాక్ ని వైట్ గా వైట్ ని బ్లాక్ గా చూపించడమే. అంటే పాత్రల రోల్ రివర్సల్ మాట!**************************************************************************ఆ ఊరిలో అన్ని కుటుంబాల్లానే అదీ ఒక కుటుంబం. చింతల్లేని కుటుంబమా? కాదా? అన్నది మున్ముందు తెల్సిపోతుంది, తొందర పడి ఓ మాటనేసుకుంటే మళ్ళీ అవ్వాక్కవ్వాల్సి రావచ్చు. ఆ కుటుంబంలో ఒక అమ్మా, ఒక... Continue Reading →

మాట – మౌనం (బ్లాక్ ఆండ్ వైట్)


రాముడూ -భీమూడు", "సీతా ఆవుర్ గీతా" సినిమా లైన్స్ మీద "మాటా-మౌనం" (పేర్లల్లో ప్రాస కుదరకపోయినా) అనే బ్లాక్ ఆండ్ వైట్ చిత్రం ఉందనుకుందాం. అదెలా ఉంటుందంటే..*********************************************************************************మాటా - మౌనం తోడబుట్టినోళ్ళనుకుంటే, అప్పుడు మౌనం పెద్దక్క అన్నమాట. నోట్లో నాలుక లేనిది. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్ల రంగు కాటన్ చీర కట్టుకుని (వీలుంటే వీణ వాయిస్తున్న ఫోజులో) జుట్టుని గట్టి ముడిగా బిగించి ఓ రకమైన హుందాతనం, ఠీవి, రాజరికం, దైవత్వం లాంటి భారీ... Continue Reading →

Space


"అసలేమయ్యిందో చెప్తే కదా నాకు తెల్సేది? ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు?" అమ్మ ఏదో అంటోంది ఇంకా.."please mom! will you go from here? I wanna my space" దుఃఖం, కోపం కలగలసిన గొంతుతో అరవాలనే అసఫల ప్రయత్నం చేశాను."ఎందుకూ? ఇంకా చిందర వందర చేసిపెట్టటానికా? నీకు ఒక గది కాదు, ఓ ఊరు రాసిచ్చినా సరిపోదు! ఆ పుస్తకాలు చూడు, అసలు చదువుతున్నావా వాటిని? ఎక్కడంటే అక్కడ అవే.... Continue Reading →

బొమ్మరిల్లు – నా సోది!


బొమ్మరిల్లు సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది నా దృష్టిలో. ఈ సినిమాకి నేను నా స్నేహితులతో వెళ్ళాను. అది పేద్ద విషయం కాదు మామూలుగా అయితే! కానీ ఈ స్నేహితులు నాకు చాలా ప్రత్యేకం. "గానం పుట్టుక గాత్రం చూడాలా?" అన్నట్టు స్నేహం పుట్టకకు మనం గుడ్డి సాక్షులం అనుకుంటాను. కలిసి పంచుకునే క్షణాల్లో ఎప్పుడో చట్టుకున్న పుట్టేస్తుంది. అలా పుట్టిందని కొన్నాళ్లకి మనకే ఎరుకలోకొచ్చి, అప్పటి నుండి దాన్ని పెంచి పోషించే కార్యక్రమం పెట్టుకుంటాం -... Continue Reading →

మరో రోజు..


"శశీ.. నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుందీ, పడుకుంటాను. నీకింకా పని ఉందా?""హమ్మ్.. రేపో ప్రెజంటేషన్ ఇవ్వాలి. చాలా ఇంపార్టెంట్! నువ్వు పడుకో.. "తన భార్యకి గుడ్ నైట్ చెప్పి శశీ తన పనిలో మునిగిపోయాడు, లాప్‍టాప్‍లో లీనమయ్యి. కమ్మని శాస్త్రీయ సంగీతం చెవుల్లో నుండి హృదయంలోకి జాలువారుతుంటే, వేళ్ళు చకచకా కీబోర్డ్ పై కదిలుతూ పని పూర్తి చేసేస్తున్నాయి. సమయం పదకొండున్నర కాబోతుంది. ఇంకో అయిదు నిమిషాల్లో పని అయ్యిపోతుందన్న ఆనందంలో అపశ్రుతిలా "డబ్" అంటూ శబ్దం వినిపించిందీ."dude..... Continue Reading →

ఓ “చిన్నూ” కథ


చిన్నూ.. రా త్వరగా! ఆటో అంకుల్ లేట్ అయ్యితే మళ్ళీ తిడతాడు""అక్కా.. ఇది చూలు, మా మిస్సూ.. నాకూ ఇక్కడా g.. o..o..d అని రాసింది. నేనింటికెళ్ళీ..అమ్మకి చూపిస్తా""ఓహ్.. అవునా! గుడ్!! ఇవ్వాళ మా ఫిసిక్స్ టీచర్ మమల్ని బాగా తిట్టి, పనిష్మెంటు కూడా ఇచ్చింది. చేతులు పైకెత్తి గంట నుంచున్నాం""మలేమో.. మా మిస్స్ గుడ్ పెట్టింది""హమ్మ్.. ఇవ్వాళ పుస్తకాల బాగ్ కడా బరువుగా ఉంది. చేతులు లాగేస్తున్నాయి""అదేంటిది? నాకూ కావాలి, తింటా""ఛీ, అలా ఫుట్ పాత్లమీద... Continue Reading →

BRB…


madhurimak: ఓయ్య్.. ఉన్నావా? techie.kiran: ఉన్నా..madhurimak: ఏం చేస్తున్నావ్?techie.kiran: అమ్మాయి గారి రాక కోసం వేయి కళ్ళతో వేయిటింగ్ ఇక్కడ! madhurimak: అబ్బా.. ఛ! అంతుందా? techie.kiran: ఏంటి ఉందా? ఇదో BRB అని అంటూ వెళ్ళావ్.. ఎంత సేపటికీ రావేం?madhurimak: ఓహ్.. సారీ కిరణ్. లీడ్‍కి అప్‍డేట్ చేద్దామని వెళ్ళానా, ఇంకేదో టాపిక్ స్టార్ట్ అయ్యింది..మాట్లాడుతూ ఉన్నాం. అందుకే లేట్! అయినా నవ్వు విండో ఓపెన్‍గా పెట్టి, నా (రాక) కోసం దాన్నే  చూస్తూ ఉన్నట్టు... Continue Reading →

ఎడబాటు


శీతాకాలం సాయంత్రం; చలీ-చీకటీ పాత స్నేహితులైయ్యినట్టు చేతిలో చేయి వేసుకుని వచ్చాయి. "బై..టేక్ కేర్" అని చెప్పేక కూడా ఇంకా ఏవైనా మాటలు పుట్టుకొస్తాయేమో అని కట్ చేయకుండా ఇద్దరం వేచి చూసిన ఆ క్షణాల్లోని నిశ్శబ్ధంలోనే ఉన్నానింకా, ఫోన్ డిస్‍కనెక్ట్ చేసి ఐదు నిముషాలవుతున్నా! నా పరధ్యానాన్ని ఆసరా చేసుకుని కొంటె గాలి చుట్టూ చేరి నన్నల్లుకుపోయ్యింది. ఒక్కసారి ఉల్లిక్కిపడిన భుజాలకి చేతులను ఆసరా ఉండమని పురమాయిస్తే. అవి కాస్తా మృదువైన చున్నీ తగిలేసరికి కాసింత... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: