I'm mighty thrilled with this development! A couple of years ago, when I was looking for a domain name for this blog, I was obsessed with the word "aksharam". In its unadulterated form, domains were exorbitantly costly. Unwilling to let it go the word totally, I came up with the jugaad - aksharf! (Harf means... Continue Reading →
విషయం సూటిదే కానీ… : కున్వర్ నారాయణ్
కవి: కున్వర్ నారాయణ్మూలం: బాత్ సీధీ థీ పర్ (హిందీ)అనువాదం: పూర్ణిమ విషయం సూటిదే కానీ ఒకసారి భాష అనే చట్రంలో కొంచెం వంకరపోయి ఇరుక్కుపోయింది దాన్ని దక్కించుకునే ప్రయాసలో భాషను ఉల్టాసీదా చేసి విరిగొట్టి మెలిపెట్టి తిప్పి తిరగేశాను విషయం చెప్పడమన్నా జరగాలి లేదా భాషనుంచి అది బయటకన్నా రావాలి కానీ వీటివల్ల భాషతో పాటుగా విషయం కూడా పేచీ పెడుతూ పెంకిదైపోయింది. ఈ కష్టాన్నంతా ధైర్యంగా ఎదుర్కోకుండా నేను స్క్రూని విప్పకుండా దాన్నింకా బిగించేసేట్టు... Continue Reading →
తక్కిన కవిత
ఆకులపై నీళ్ళు పడ్డాయికి ఉన్న అర్థం నీళ్ళపై ఆకులు పడ్డాయికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనది జీవితాన్ని పూర్తిగా పొందడానికీ పూర్తిగా ఇచ్చేయడానికీ మధ్య ఒక నిండైన మృత్యు చిహ్నం ఉంటుంది తక్కిన కవిత పదాలతో రాయబడదు అస్తిత్వాన్ని మొత్తం గుంజి ఒక విరామంలాగా ఎక్కడో చోట విడిచివేయబడుతుంది. కవి: కున్వర్ నారాయణ్ మూలం: బాకీ కవిత (హిందీ) అనువాదం: పూర్ణిమ
Missing – అగుపడనోడి పోలిక: Kunwar Narayan
కవి: కున్వర్ నారాయణ్ మూలం: లాపతా కా హులియా (హింది) అనువాదం పూర్ణిమ అగుపడనోడి పోలికలు రంగు గోధుమ హంగు రైతులెక్క నుదుటిమీద గాయమైనట్టు మచ్చ ఎత్తు ఐదడుగులకంటే తక్కువైతే కాదు మాట్లాడతడు ఏ చింతా లేనట్టు నత్తోడు వయసు అడిగితే వేల ఏళ్ళకన్నా కాస్త ఎక్కువే అంటడు పిచ్చోని లెక్క కొడతడు - కానీ కాదు ఎత్తులనుంచి పడి బొక్కలు ఇరగొట్టుకున్నాడు, మస్తు సార్లు అందుకే, చూడ్డానికే అతికించినట్టుంటడు హిందుస్తానీ నక్షా లెక్క! Missing Color... Continue Reading →
New Books – కొత్త పుస్తకాలు: Kunwar Narayan
New books, at first from a distance stare at me with a shyness Then, shrugging off any hesitation they sit and spread in front of me, on the table I read The first introduction... touch with the thrill of a handshake a beginning... they open up slowly page by page intense proximity Some become friends... Continue Reading →
అయోధ్య, 1992
హే రామ్, జీవితం ఒక కఠనమైన యదార్థం నువ్వేమో ఓ మహాకావ్యం నీవల్ల కాదులే ఈ అవివేకంపై విజయం దానికి పది కాదు, ఇరవై కాదు ఉన్నాయిప్పుడు లక్షల్లో తలలు, లక్షల్లో చేతులు విభీషణుడు ఇప్పుడు ఎవరి వైపునున్నాడో మరి ఇంతకన్నా పెద్ద ఏం జరుగుతుందిలే మన దౌర్భాగ్యం ఒక వివాదాస్పదమైన స్థలానికి పరిమితమై పోయింది నీ సామ్రాజ్యం అయోధ్య ఇప్పుడు నీ అయోధ్య కాదు యోధుల లంక అది, ’మానస’ నీ ’చరితం’ కాదు ఎన్నికల... Continue Reading →