కవి: కున్వర్ నారాయణ్మూలం: బాత్ సీధీ థీ పర్ (హిందీ)అనువాదం: పూర్ణిమ విషయం సూటిదే కానీ ఒకసారి భాష అనే చట్రంలో కొంచెం వంకరపోయి ఇరుక్కుపోయింది దాన్ని దక్కించుకునే ప్రయాసలో భాషను ఉల్టాసీదా చేసి విరిగొట్టి మెలిపెట్టి తిప్పి తిరగేశాను విషయం చెప్పడమన్నా జరగాలి లేదా భాషనుంచి అది బయటకన్నా రావాలి కానీ వీటివల్ల భాషతో పాటుగా విషయం కూడా పేచీ పెడుతూ పెంకిదైపోయింది. ఈ కష్టాన్నంతా ధైర్యంగా ఎదుర్కోకుండా నేను స్క్రూని విప్పకుండా దాన్నింకా బిగించేసేట్టు... Continue Reading →
తక్కిన కవిత
ఆకులపై నీళ్ళు పడ్డాయికి ఉన్న అర్థం నీళ్ళపై ఆకులు పడ్డాయికి ఉన్న అర్థానికన్నా భిన్నమైనది జీవితాన్ని పూర్తిగా పొందడానికీ పూర్తిగా ఇచ్చేయడానికీ మధ్య ఒక నిండైన మృత్యు చిహ్నం ఉంటుంది తక్కిన కవిత పదాలతో రాయబడదు అస్తిత్వాన్ని మొత్తం గుంజి ఒక విరామంలాగా ఎక్కడో చోట విడిచివేయబడుతుంది. కవి: కున్వర్ నారాయణ్ మూలం: బాకీ కవిత (హిందీ) అనువాదం: పూర్ణిమ
New Books – కొత్త పుస్తకాలు: Kunwar Narayan
New books, at first from a distance stare at me with a shyness Then, shrugging off any hesitation they sit and spread in front of me, on the table I read The first introduction... touch with the thrill of a handshake a beginning... they open up slowly page by page intense proximity Some become friends... Continue Reading →