పదేళ్ళ కిందట.. "మోసం" అనే పదం అనుభవంలోకి వచ్చింది. "వెన్నుపోటు" అంటే తెలిసొచ్చింది. "నిఘా" పనితీరుని గొల్లవాడి కన్ను వెక్కిరించింది. "అమానుషం" అనేది కళ్ళ ముందు కుళ్ళిన శవాల రూపంలో సాక్షాత్కరించింది. "కడుపుకోత"ను గూర్చి ఎదిగిన కొడుకులను పోగొట్టుకున్న తల్లి చెప్పుకొచ్చింది. "కర్తవ్య నిర్వహణ"ను భర్త భౌతికకాయానికి సెల్యూట్ కొట్టిన భార్య నేర్పింది. "మానవత్వం" అంటే శత్రువుల దహన సంస్కారం కానిచ్చిన తీరు స్పష్టం చేసింది. "రాజకీయం" అంటే ఏమిటో నేతల కల్లబొల్లి మాటలు నిరూపించాయి. శిఖరాలు... Continue Reading →
సముద్ర తీరాన..
"సాగర్ కినారే.. దిల్ యె పుకారే.. " కిషోర్ దా మొదలెట్టాడు పాడ్డం. ఆ సమ్మోహనాస్త్రానికి దాసోహం అనేదాన్నే, "సముద్ర తీరాన నేను" అనే జ్ఞాపకాల తుట్ట కదలకపోయుంటే! కొన్ని మన అనుభవంలోకి వచ్చి దూరమవుతాయి. దగ్గరున్నప్పటి క్షణాలు ఎలా వచ్చిపోయాయో మనం గ్రహించే లోపే అవి మాయమయ్యిపోతాయి. అవి దూరమయ్యాక, కలిసి గడిపిన క్షణాల జాబితా రాసుకొని, నెమరవేసుకుంటూ, ఆ క్షణాలకున్న స్వచ్ఛతకి ఈ క్షణపు రంగును పులిమి ఓ కొత్త చిత్రం తయారుచేసుకుంటాము. కానీ... Continue Reading →
ప్రేమించటం కష్టం!
ప్రేమించటం కష్టం! ముడతలు పడిపోయి, ఊసురోమంటూ ఉన్న నిర్జీవమైన ఊదని బుడగను తీసుకొని దానికి ఊపిరిపోయటంతో ప్రారంభమవుతుంది కథంతా! కొన్ని సందర్భాల్లో మనకే అంత ఊపిరిచ్చే ఓపిక ఉండదు. కళ్ళముందు అది ఆకారం దాల్చుతుందే కానీ అట్టే ఎక్కువ కాలం నిలువదు. బుగ్గలు నొప్పెట్టి, ఊపిరి తిత్తులు సహకరించక మనమే వదిలేస్తాం. ఇంకొన్ని సార్లు మనం ఊపిరినిస్తున్న కొద్దీ బుడగ పెద్దవుతూ సంతృప్తి కలిగిస్తూనే ఉన్నా, మనం కాస్త ఊపిరి తీసుకునేలోపు మళ్ళీ నీరసపడిపోతుంది. మళ్ళీ గాలిపోస్తాం.... Continue Reading →