First published on patrika.kinige.com (హరిశంకర్ పార్సాయి (1924-1995) హింది సాహిత్య జగత్తులో వ్యంగ్యహాస్య రచయితగా సుప్రసిద్ధి చెందినవారు. కేంద్రసాహిత్య ఎకాడెమీ అవార్డు గ్రహీత. అలతి పదాలతో, నిరాడంబర శైలిలో కొనసాగే వీరి రచనలు సమాజంలో పేరుకుపోయిన కుళ్లును కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. ఉపరితలంలో హస్యం ఉబికినట్టు కనిపించినా, వీరి రచనల్లో అంతర్లీనంగా కనిపించేది సమాజం పట్ల బాధ్యత. “షికాయత్ ముఝె భీ హై” అనే వీరి వ్యాసాల సంపుటి నుండి “న్యాయ్ కా దర్వాజా” వ్యాసానికి... Continue Reading →
Whatever you may call that!
కొత్త మెయిల్ వచ్చింది మెయిల్-బాక్స్ లోకి. ఆమె నుండే! పైకి ఒప్పుకోకపోవచ్చుగానీ, అది వస్తుందని అతడికి ఓ మోస్తరు నమ్మకం. రావాలన్న కోరిక కూడా కాబోలు. చూసీ చూడని ఎదురుచూపులూ ఉన్నాయి. తీరా అది రానే వచ్చాక దాన్ని వెంటనే తెరిచే ధైర్యం లేక మంచానికి వాలబడ్డాడు. చీకటిగా ఉన్న గదిలో లాప్టాప్ వెలుతురు మొహం మీద పడుతుంటే, ఓ రెండున్నర గంటల ముందు వాళ్ళిద్దరి మధ్యా ఫోన్ సంభాషణ మళ్ళీ వినిపించింది. పరస్పరం "హలో!" అన్నాక... Continue Reading →