లాన్స్ ఆర్మ్ స్ట్ర్ట్రాంగ్ – ఆత్మకథ


2003-04 సీసన్ లో ఊకదంపుడు దంచాక, వివిస్ లక్ష్మణ్ ఒకానొక ఇంటర్వులో తనకిష్టమైన పుస్తకాల్లో "Its not about bike, My journey back to life" అని చెప్పిన మరుక్షణం ఈ పుస్తకం చదివేయాలనుకున్నాను. కాని ఎక్కడ??.. ఇంటర్నల్లు, సెమిస్టర్లు, ఎగ్జాములు అంటూ గడిచిపొయింది. పోనీ ఉద్యోగంలో చేరాకైనా అనుకుంటే.. ట్రేనింగులు, మీటింగులు, బిల్డులు..రిగ్రషన్లు అంటూ కాలం నిలవలేదు. ఏదో సినిమాకి ప్రసాద్స్ కి వెళ్తే టికెట్స్ దొరకలేదు.. అక్కడే ఉన్న "Odyssey"లో ఈ పుస్తకం... Continue Reading →

నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే


తన అనురాగపు కిరణాలు నామీద ప్రసరించగానే వానచినుకులా మబ్బుచాటున మాటువేసిన నేను తెల్లని ఆ కిరణానికి ఏడు రంగులు పులిమి.. నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు పొంగులే.. అని పాడాలనుకున్నా!! కారుమబ్బులలో చిక్కుకుపోయింది కిరణం విరహవేదనతో విలపిస్తూ భారంగా మారిన నన్ను తనలో దాచుకున్న మబ్బే నేలకు సాగనంపింది. మచ్చలేని మమతకు లోకంలో రంగులన్నీ పరిచయం చెయ్యాలనుకున్నా.. కానీ నలుపొక్కటే చూపించింది ఈ ప్రకృతి మాకు నే మనసు పడిన వెంటనే ఓ ఇంద్రధనుస్సు... Continue Reading →

రాముడా?? రావణుడా??


నాపై అనుమానంతో అగ్నిపరీక్ష పెట్టిన రాముడా నాకై బంగారు లంకను అగ్నికి ఆహుతిచ్చిన రావణుడా నన్ను తప్ప ఇంకెవరినీ దరిచేరనివ్వని రాముడా నాకై సర్వస్వాని పోగట్టుకున్న రావణుడా తప్పుచేయకపోయినా లోకం కోసం కారడువులలో వదిలిన రాముడా తప్పని తెలిసినా ఆత్మార్పణ చేసిన రావణుడా ఎవరు నన్ను ఆరాధించిన వారు?ఎవరు నన్ను ప్రేమించింది? తాగుబోతు కూతలకు ఆలిని కాదనుకున్న రాముడేమి దేవుడు? హృదిలో కట్టిన వలపు గుడికై, పతనమైపోయినా రావణుడు రాక్షసుడా?? అని అనిపించినా తన పతనానికి కారణభూతంగా... Continue Reading →

వాన అలిగితే..


""వర్సం పప్పొతుంది డాడి, వర్సం పప్పోతుంది !!" అని చిన్నా అరిచేవరకు నువ్వు నా రాకను గమనించలేదు అంటే, అసలు నేనిప్పుడు రావాలా వద్దా అని ఆలోచిస్తున్నా!! నన్ను చూసి ఆ చిన్ని గొంతులో ఎన్ని భావాలు.. నేను ఎక్కడనుండి వస్తున్నానో అని ఆశ్చర్యం, వచ్చి ఏమి చేస్తాను అని భయం, మెరుపులా గర్జిస్తానేమో అని అనుమానం, అయినా ఆనందం!! అది నా కోసం పడే ఆనందం. నీకు అర్దమైయేలా చెప్పాలి అంటే, "ఇట్స్ ఎక్స్ క్లుసివ్... Continue Reading →

కన్యాదానం


తెర తీసిన తరుణంలో నన్ను చదువ తొందరపడే అతని చూపులు కొత్త రెక్కలు తొడిగే నా తలపులు అతడు చాచిన చేతిలో నా దోసిలి పెట్టి ముసి ముసిగా నవ్వుకుని మురిసిపొయే వేళ భాజా భజంత్రీలతో మోగుతున్న మంటపంలో వేద మంత్రాల నడుమ, "ఇహ నీదే నా చిట్టి తల్లి" అంటూ కన్యాదానం చేసే నాన్న కన్నీళ్ళ పర్యంతమైతే.. ఏమి చేయను? ఎలా సంభాలించను? అతడి గుప్పట్లో ఉండిపోయాయి చేతులు వదలలేను, ఆ కన్నీటిని తుడవలేను, నా... Continue Reading →

మేధావి మనిషి


తెల్లారే లేచి, తల్లంటు పోసుకుని, చీరను సింగారించుకొని, నగా నట్రా పెట్టుకుని.. కాటుక చాటున రెప్పలు అతడి ఊహా చిత్రాన్ని గీయలేక ఇబ్బంది పడుతుంటే, ఫక్కున నవ్వే మనసు..మరుక్షణం ఏమి జరుగుతుందో అని గాబరా పడుతుంది.. ఇది ఒక అపూర్వ అనుభూతి. పెద్దల సమక్షంలో జరిగే పెళ్లి చూపుల్లో అతడిని చూడాలి, కన్ను కన్ను కలిసిన క్షణంలో హృదయంలో రేగే అలజడిని పంటి కింద అదమాలి. తన కంచు కంఠం చెవిని తాకగానే, మదిలో మ్రోగే వీణలను... Continue Reading →

ఓ అత్తా!!


ఎక్కడో పడి ఉన్న తులసి మొక్కను తీసుకువచ్చి.. దానికో గుడి కట్టి, అందులో ప్రతిష్టించి రోజూ పూజలు చేసి, హారతులు ఇచ్చి మా ఇంటి "లక్ష్మి" అంటూ ఆరాధించి మురిసిపొయే ఓ అత్తా... అల్లారుముద్దుగా పెరిగి, నీ ఇంట మెట్టి నీ వంశ ధారను కావలసిన నన్ను "లక్ష్మి"* తేలేదు అంటూ కొట్టి, తిట్టి, అగ్నికి ఆహుతి చేసి కక్ష తీర్చుకొనే నా అత్తా.. నీ జాతి మీద నీకున్న గౌరవం ఇదేనా?? మానుకున్న విలువ మనిషికి... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: