http://patrika.kinige.com/?p=1516 అద్దం ముందు నిలుచుంది ఆమె. తనని తాను తీక్షణంగా చూసుకుంటోంది. చెదిరిన జుట్టు, ఉబ్బిన మొహం, ఎరుపెక్కిన కళ్ళు, ఆఫీసునుండి వచ్చాక మార్చని బట్టలు కనిపిస్తున్నాయి ట్యూబ్‌లైట్ ప్రసరించే వెలుగులో. ఆ కనిపిస్తున్నవేవీ ఆమెకు నచ్చటంలేదు. పక్కన లేని అర్జున్ను అద్దంలో ఉన్నట్టు ఊహించుకోసాగింది. ఊహాల అద్దంలో కనిపిస్తున్న తమ జంటలో, తనని చెరిపేసుకొని, ఆ స్థానంలో అర్జున్‌కు నచ్చిన సినిమా హీరోయిన్ను నిలబెట్టింది. బాగనిపించారు వాళ్ళిద్దరు. హీరోయిన్ను చెరిపేసి తనను పెట్టుకుంది మళ్ళీ! అబ్బే..... Continue Reading →
పోటీదారులు
ఆమె-1 కూ, ఆమె-2 కూ మధ్య పోటీ మొదలయ్యింది. ఇద్దరూ చెరో మట్టి బొమ్మ చేయాలి - అతడి బొమ్మ. ఎవరి బొమ్మ అతడికి దగ్గర పోలికలతో ఉంటే, వారికే ట్రోఫీ - అతడు. నిజానికి వీళ్ళ మధ్య పోటీలో సమానత్వం లేదు. ఆమె-1 బలమైన ప్రత్యర్థి. ఆమె-2 కన్నా ఆమె అన్ని విధాలా సీనియర్ - వయస్సులోనూ, అనుభవంలోనూ, అతడితో పరిచయం, స్నేహం, ప్రేమ, వగైరాలలోనూ. ఈ పోటీకి కామెంటేటర్లు లేరుగానీ, ఉండుంటే ఆమె-2ను తీసిపాడేద్దురు వారి... Continue Reading →