ఇవ్వాళెందుకో రాయాలనిపిస్తోంది. రాస్తూనే ఉండాలనిపిస్తోంది. కథలో, కవితలో కాదు. అచ్చంగా నా ఆలోచనలే. ఏ ముసుగు లేకుండా! అందుగ్గానూ నీ ఇన్బాక్స్ ఎన్నుకున్నాను. ఒక కాల్తో పోయేదానికి ఎందుకిలా కాల్చుకొని తినడమంటే.. దోరగా వేయించిన చివాట్లు పెడతావనీ.. ఎంతగా ధ్యాస మారుస్తున్నా ఒకటే ఇమేజ్ కళ్ళ ముందు కదలాడుతోంది. చేతికి లోతైన గాటు పడినట్టు. నెత్తురోడుతున్నట్టు. సూదిని చర్మంలోకి దించి పైకి లాగుతున్నప్పుడు దారపు పోగులపై రక్తం పాకుతున్నట్టు.. ఊహించుకో! తెల్లటి దారం పై మెల్లమెల్లగా పాకుతున్న... Continue Reading →