ఊహలన్నీ ఊసులై..

బడుగు జీవితంలో కొంత #matargashti


నీల్ గేమెన్ “క్రియేటివ్ కంపోస్ట్” అని ఒకటి పెట్టుకోమని చెప్తారు. ఒక నోట్‍బుక్‍లో మనం చదువుతున్నవీ, ఆలోచించుకుంటున్నవీ రాసుకుంటూ పోతే అదొక compost లా పనిచేసి మన

Continue reading

డెత్ (ఇచ్చే) సర్టిఫికేట్


మా ఆయన చనిపోయాడు. నాలుగురోజుల క్రితం. కాదు కాదు. ఐదు రోజులనుకుంటా. టైమ్‍జోన్ తేడాలు కలుపుకుంటే ఏ రోజు వస్తుందో. లెక్కపెట్టడానికి నాకెవ్వరూ వివరాలు ఇవ్వడం లేదు.

Continue reading

Side characters & stereotypes in short stories


కథా ప్రపంచంలో పాత్రలు కూడా రాత్రి పూట ఆకాశంలో వెలిగే తారల్లాంటివే! వాటిని కలుపుకుంటూనో, విడదీసుకుంటూనో, ఒకదానితో ఇంకోదానికున్న సంబంధం వెతుక్కుంటూ పోతేనో కథలు పుట్టుకొస్తాయి. కొత్తగా వస్తున్న తెలుగు కథల్లో పాత్రల నిర్మాణం, నిర్వహణలపై శ్రద్ధ బొత్తిగా కనిపించడం లేదు. సాహిత్యమంటేనే అబద్ధాలతో అల్లిన ప్రత్యేకతల (specialties, idiosyncrasies) ద్వారా ఒక సార్వజనీయమైన సత్యాన్ని (fundamental generic truth)ని చేరుకోవడం. కానీ మన కథలు మాత్రం పాత్రలకీ ఒక సార్వజనీయతను ఆపాదించేస్తునే రాయబడుతున్నాయి. ప్రధాన పాత్రల విషయంలో (అంటే కథ ఎవరిదో వాళ్ళ విషయంలో) ఇలాంటి generalization వల్ల కథెలా పేలవంగా మారిపోతుందనేది ఇంకో రోజున చర్చించుకుందాం. ఇవ్వాళ్టికి మాత్రం ప్రధానేతర పాత్రల గురించి మాత్రమే ప్రస్తావన.

Writing & Loneliness


ట్రెక్ చేసేటప్పుడు, రాసేటప్పుడు మన మధ్యస్థ క్షేత్రపు స్పృహకి ఎక్కువ ఆస్కారం ఉండదు. ఏ రాయి మీద అడుగేస్తే మన బాలెన్స్ నిలుస్తుంది అన్నంత ప్రాథమికమైన నిర్ణయాలు అడుగడుక్కీ తీసుకుంటుంటాము కాబట్టి, ఒక్కో పదాన్ని తరిచి చూసుకుంటూ వాక్యం తర్వాత వాక్యం రాసుకుంటూ పోతుంటాం కాబట్టి రాయడమనేది ఇన్నర్ జోన్‍లోనే జరుగుతుంది అని నాకనిపిస్తుంది. అయితే ఏం రాయాలి, ఎలా రాయాలి అన్నది మాత్రం మిడిల్ జోన్‍లోనే జరిగే పనే! The non-writing part of writing (conceptualization) happens in the middle zone, but the very act of writing (creation) is in the inner zone! అని నాకు బలంగా అనిపిస్తుంది. నిపుణులు కాదనచ్చు, కానీ నాకైతే అలానే అనిపిస్తుంది. రైటర్స్ బ్లాక్ అంటే మనం ఆ ఇన్నర్ జోన్‍లోకి వెళ్ళలేక మిడిల్ జోన్‍లోనే కొట్టుకోవడం అని అర్థం చేసుకోవచ్చు.