ఊహలన్నీ ఊసులై..

అనువాదాలు: తెలుగులోకి vs తెలుగులోంచి


“తెలుగులో అనువాదాలు ఎక్కువగానే వస్తున్నాయి. తెలుగు నుండే జరగటం లేదు…” తెలుగునాట సాహిత్య అనువాదాల ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినిపించే మాట ఇది. మాటమాటల్లో మామూలుగా అనే మాట

Continue reading

బడుగు జీవితంలో #matargashti: Jul-Sept’21


చూస్తూ చూస్తూ మరో మూడునెలలు ఇట్టే గడిచిపోయాయి. షరా మామూలుగానే, అవుతాయనుకున్న పనులు అవ్వలేదు. కొన్ని పనులు అయినా అప్పుడే బయటకు చెప్పడానికి వీల్లేదు. అబ్బుర పరిచే

Continue reading

తెలుగు పుస్తకాల ప్రచురణ – కొన్ని ఆలోచనలు


మొన్న శనివారం ఏవో పనుల మధ్య ఒక తెలుగు సాహిత్య ఈవెంట్‍కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికీ చాలా సేపు లోపలకి వెళ్ళకుండా రవీంద్ర భారతి మెట్ల మీదే

Continue reading

కాలయంత్రంలో ’అన్నీసా’ కథకు స్పందనలు


కాలయంత్రం 2020లో నేనొక కథ రాశాను, ’అన్నీసా’ అనే పేరుతో. గత శతాబ్దపు తొలినాళ్ళల్లో మహిళా పత్రికలకి మహిళా సంపాదకులు ఉండేవారన్న విషయాలు చదువుతూ ఉంటే ఈ

Continue reading

పాతాళ భైరవి: A masterclass in retelling


“సాహసే ధైర్యే లక్ష్మి” అన్నది ఎంత నిజమో, “సాహసే ధైర్యే సరస్వతి” కూడా అంతే నిజమనిపించింది. ఆ మాత్రం తెగువూ, దమ్ము లేకపోతే సృష్టించడం సాధ్యమేనా?! 

వేణు శ్రీకాంత్‍కి, ప్రేమతో…


అహనా పెళ్ళంటలో ఆటోబయోగ్రఫీ చెప్పుకునే నూతన్ ప్రసాద్ లా “స్నేహాలు పలురకాలు…” అని మొదలుపెట్టి పెద్ద క్లాస్ పీకాలని ఉంది కానీ పోన్లే పాపం అని క్షమించి

Continue reading

బడుగు జీవితంలో కొంత #matargashti


నీల్ గేమెన్ “క్రియేటివ్ కంపోస్ట్” అని ఒకటి పెట్టుకోమని చెప్తారు. ఒక నోట్‍బుక్‍లో మనం చదువుతున్నవీ, ఆలోచించుకుంటున్నవీ రాసుకుంటూ పోతే అదొక compost లా పనిచేసి మన

Continue reading

Side characters & stereotypes in short stories


కథా ప్రపంచంలో పాత్రలు కూడా రాత్రి పూట ఆకాశంలో వెలిగే తారల్లాంటివే! వాటిని కలుపుకుంటూనో, విడదీసుకుంటూనో, ఒకదానితో ఇంకోదానికున్న సంబంధం వెతుక్కుంటూ పోతేనో కథలు పుట్టుకొస్తాయి. కొత్తగా వస్తున్న తెలుగు కథల్లో పాత్రల నిర్మాణం, నిర్వహణలపై శ్రద్ధ బొత్తిగా కనిపించడం లేదు. సాహిత్యమంటేనే అబద్ధాలతో అల్లిన ప్రత్యేకతల (specialties, idiosyncrasies) ద్వారా ఒక సార్వజనీయమైన సత్యాన్ని (fundamental generic truth)ని చేరుకోవడం. కానీ మన కథలు మాత్రం పాత్రలకీ ఒక సార్వజనీయతను ఆపాదించేస్తునే రాయబడుతున్నాయి. ప్రధాన పాత్రల విషయంలో (అంటే కథ ఎవరిదో వాళ్ళ విషయంలో) ఇలాంటి generalization వల్ల కథెలా పేలవంగా మారిపోతుందనేది ఇంకో రోజున చర్చించుకుందాం. ఇవ్వాళ్టికి మాత్రం ప్రధానేతర పాత్రల గురించి మాత్రమే ప్రస్తావన.