అక్షరానుభవాలు!


అక్షరాలతో తొలి పరిచయం గోడ వేలాడదీసిన కాలెండర్లో తెలిసున్న వాటి పక్కనే అర్థంలేని అకారాలుగా! అక్షరమేంటో గుర్తుపట్టమన్న ప్రతీసారి పోల్చలేక, పోల్చీ చెప్పలేక తడబాటు! నల్లని పలక మీద తెల్లని బలపంతో అమ్మ గుప్పిట్లో దాగిపోయిన నా వేళ్ళు నెలపొడుపులా ఉన్న అక్షరాల్ని కాస్త నిండు పున్నమిగా చేసేయటం నా ప్రస్థానంలో మరో అడుగు. తప్పుగా రాసేసి అమ్మ తిడుతుందనే భయంతో ఎంగిలి పెట్టి వాటి తుడిపేయ్యడం. "పలక సరస్వతీ దేవి, అలా చెయ్యద్దని చెప్పానా?" అంటూ... Continue Reading →

అమ్మా.. నాన్నని చూడు..


"భూఉఉఉఉఉఉ....." "అమ్మో.. !" "ఇహిహి..హహ.. భయపడ్డావ్..భయపడ్డావ్!" "పో రా.. నేన్నీతో మాట్లాడను పో! నాతో ఏం ఆటలాడక్కరలేదు." "ఏం?.. ఊ?" "ఏంట్రా బెదిరిస్తున్నావ్? అమ్మ ఒక్కత్తే పని చేసుకుంటుందే, చెల్లి చిన్నారి నీళ్ళల్లోకి వెళ్ళిపోతుందే.. కాస్త దాన్ని ఆడిద్దాం అని ఏమన్నా సాయం చేస్తావా? నాతో మాట్లాడక.." "నువ్వేమో టామ్ ఆన్ జెర్రీ వస్తున్నప్పుడే పిలుస్తావ్? ఓన్లీ థర్టీ మినిట్స్ కదమ్మా!" "మనకి నీళ్ళొచ్చేదీ ఆ థర్టీ మినిట్సే కద నాన్న!" "..." "ఏంటో.. అంతగా ఆలోచిస్తున్నావు?"... Continue Reading →

Life of Pi


( "అబ్బా మళ్ళీ ఇంకో పుస్తకమా? చదివేయటం.. రాసేయటం! ఇప్పుడు చదవాలా? ఎందుకు చదవటం.. ఎటూ పుస్తకాలు కొని చదివేంత లేదు! అదీకాక ఇలా పనులు కానీ పనులు పెట్టుకుంటే.. అసలైన పనుల పనేంగానూ?" అనుకుంటూ మీరీ టపా చదవకుండా వదిలేస్తే ఒక రకంగా మీరు అదృష్టవంతులు. కానీ ఈ పుస్తకం చదవకపోతే మీరెంతో కొంత మిస్సవుతారని రూఢీగా చెప్పగలను. ) నిద్రపోతున్నప్పుడు కలలు వస్తాయి. (మన ప్రమేయం పెద్దగా లేన్నట్టనిపిస్తుంది!) "అమ్మ పక్కనే కూర్చుని తలనిమురుతుందన్నట్టు"... Continue Reading →

బ్లాగు ప్రయాణం లో నేను: పూర్ణిమ


నా ఉద్యోగానుభవాన్ని ఓ రెండు ముక్కల్లో చెప్పమంటే "Extended College" అని చెప్తా. ఇంకో రెండు ముక్కలు జత చేసుకోవచ్చు అంటే "Extended College minus Internals" అని ముగిస్తా.:-)) నా బ్లాగానుభవాన్నీ అలానే చెపచ్చు, "Back to the School" అని! బడిలో ఏం చేస్తామో తెలియనిదెవ్వరికీ? పాఠాలు (తెలుగు నేర్చుకుంద్దాం అనుకున్నా, జీవితం కూడా తెలుస్తోంది కొంచెం కొంచెం గా) కాక ఆటలూ-పాటలూ (ఇక్కడ fun కీ, pun కీ ఏం కొదవని?), పాట్లూ... Continue Reading →

ట్రాఫిక్ జాం


మళ్ళీ ట్రాఫిక్ జాం! యుద్ధంలో అయితే భీరువో, వీరుడో, విజేతో ఎవరో ఒకరిగా మిగలచ్చు. చదరంగంలోనైనా, సరిహద్దుపైనైనా సిపాయికి వెనుకడుగుండదట. ట్రాఫిక్ లోనూ అంతే. కాకపోతే వారికి ముందుకెళ్ళే వెసలుబాటుంటుంది --  చంపడానికో, చనిపోవడానికో! ఇక్కడలా కుదరదు, ఒక్కటే సాధ్యమిక్కడ - ఇర్రుక్కోవటం! ముందో బెంజు కారూ, దాని పక్కనో డొక్కు వానూ. బైక్ మీద యువ జంట, పొగలు కక్కుతున్న ఆటో , పక్కనే ఉన్న కిక్కిరిసిన బస్సు ఒక మిని గ్లోబు. కారద్దంలో కనిపించే... Continue Reading →

దీనర్థమేమిటో .. ??!!


ఇవ్వాల ఊసుపోక ఏదో గూగిల్లి మరేదో చదువుతుంటే, ఈ కింది వాక్యం తగిలింది. "ఆహా!" అనేసుకుని జీటాక్ స్టేటస్ మెసేజ్ గా అయితే పెట్టుకున్నాను గానీ, ఆహా కాస్త "అవునా?" కి పయనిస్తూనే ఉంది. కాసేపు ఆలోచించి, ఇంకాస్సేపు చర్చించి, ఇక లాభం లేదని, మీ అందరి సహాయార్థం ఇక్కడ పెడుతున్నాను. We all know that Art is not truth. Art is a lie that makes us realize the truth,... Continue Reading →

ఒక ఉలిపికట్టె కథ..


పోయిన వారాంతం విశాలాంధ్ర మీద దాదాపు దాడి లాంటిది చేసి మరీ కొన్న అనేకానేకమైన పుస్తకాల్లో, డా|| కేశవ రెడ్డి రచించిన "సిటీ బ్యూటిఫుల్" అత్యంత తక్కువ పేజీలు కలదీ, అంతే చవకా కూడా! అప్పుడెప్పుడో నవీన్ రాసిన "అంపశయ్య" పుస్తకం ఒక యాభై పేజీలు చదివి మళ్ళా ముట్టుకోలేదు. ఈ పుస్తకం "ముందు మాట"లో దాని ప్రస్తావన చూసి హడలిపోయాను. ఉన్నవే తొంభై పేజీలన్న ధైర్యంతో మొదలెట్టాను. కథ విషయానికి వస్తే దాదాపు అంపశయ్య కథే!... Continue Reading →

నిశి, నిశాంతంలో పూర్ణిమ


"గిటారై మోగుతున్నది యద" - ఊహ! హృదయమే ఒక వాయిద్యంగా మారి, సుతారంగా మీటిన ప్రతీ స్పర్శకీ స్పందించి సంగీతాన్ని వినిపిస్తుందన్న ఊహ. ఊహకందని అనుభవం ఏమిటో కానీ, ఊహించుకున్న అద్భుతం ప్రత్యక్షానుభవంలోకి వస్తుందంటే మాత్రం ఉద్వేగంతో ఊపిరికి ఊపిరాడదు. మనో నేత్రానికి చిరపరిచితమైన చిత్ర పటం, కళ్ళ ముందు సజీవంగా  ప్రాణంతో నిలుస్తానంటుంటే వెన్నులో జలదరింపు ప్రాణం పోసుకుంటుంది. గొణ్ణం తీస్తున్న నా వేళ్ళు వణుకుతున్నాయి: చూడాలన్న ఆత్రుత, చూడగలనా అన్న సంకోచం, చూస్తే కదా... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: