అల్లరా.. నేనా??


"కాలేజ్ స్టూడెంటా.. నేనా??.." అనే సంతూర్ ఆడ్ గుర్తొంస్తుందా?? రావాలి మరి! అసలు నా బ్లాగుకి ఏమాత్రం సూటవ్వని జ్ఞాపకాలనే.. ఏదో.. అలా అలా రాసి తప్పించుకున్నాను కానీ.. ఇప్పుడు అల్లరి అంటే పూర్తిగా చేతులెత్తేయాల్సిందే!! ఇప్పటికిప్పుడు.. అణు ఒప్పందం మీదో.. చిరంజీవి పార్టీ విషయమో.. లేక ఏదో తెలుగు సినిమా చూసి మరీ సమీక్ష రాయడమో తేలిక కానీ.. అల్లరంటే అస్సలంటే.. అస్సలంటే అస్సలు ఏమీ లేదనిపిస్తుంది. "అబ్బా ఎప్పుడూ మనుషుల మొహం మీద తిరుగుతూ... Continue Reading →

శిలాక్షరాలైన క్షణాలు- 2


బ్రతుకు తెరువు చూపిస్తున్న ఊరిలో బతుకే ఒక ప్రశ్నార్ధకంగా మారితే.. పుట్టిన ఊరికే తిరుగుప్రయాణం కట్టాము. నాంపల్లిలో రైలెక్కినా.. ఇంటికి తిరిగివెళ్ళిపోతే బాగుణ్ణు అనిపిస్తుండింది నాకు. రైలు హైదరాబాద్ ని వదిలి దూరంగా పోతున్నకొద్దీ.. నా మనసు దానిమీదకు పోతోంది. "మనవాళ్ళె"వరూ అంటే గుర్తించలేని వయస్సులో కూడా హైద్ అంటే నాకు చాలా ఇష్టం. అది నాది అనే భావన. "రాష్టంలో అతి ముఖ్యమైన పట్టణాలు" అనే పాఠం.. హైద్ తో మొదలవుతుంది. అటు తర్వాత వైజాగ్,... Continue Reading →

శిలాక్షరాలైన క్షణాలు – 1


అవి నాకు తెలుగు అక్షరాలు పూర్తిగా వచ్చి.. గుణింతాలు చదువుకుంటున్న రోజులు. అదే ఏడాది మా స్కూల్ పెట్టి పాతిక సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అంటే.. ఓ పెద్ద పండగ చేసుకోడానికి సన్నద్ధం అవుతున్న వేళ. ఆటలు, పాటలు, నాటికలు, నృత్యాలు, సైన్స్ ఎగ్జిబిషన్స్.. ఒకటేమిటి.. అన్నింటి కోసం సంసిద్ధం అవుతున్నాము. ఎగ్జిబిషన్లో పెట్టడానికి.. నేను ఎంచుకున్న అంశం.. ఇల్లూ, వాటి రకాల్లో.. రెండంతస్తుల మేడ. మిగితా వారు గుడిసెనీ, పక్క ఇల్లనీ.. ఇలా చేసుకురావాలని చెప్పారు... Continue Reading →

అద్దం లాంటి జ్ఞాపకం!!


ఏం చేస్తున్నావు ఇంకా నిద్రపోకుండా... నువ్వు నీ పనులన్నీ కట్టి పెట్టి వచ్చేదే చాలా ఆలస్యంగా.. మళ్ళీ ఇక్కడ కూడా ఆలోచనలా?? ఎవరు నువ్వు? ఈ క్షణాన నన్ను చూసినవారెవ్వరైనా గాఢ నిద్రలో ఉన్నా అనుకుంటారు.. మరి నీకెలా తెలుసు, నేనింకా నిద్రపోలేదని? హమ్మ్.. ఏంటా నీ ప్రశ్న.. నేను నీలోనే ఉంటాను. నీతోనే ఉంటాను.. నన్నే ఎవరు అని అడుగుతున్నావా?? ఓ.. నువ్వా?? సినిమాల్లో చూపిస్తారు కదా.. ఇప్పుడు అసలైతే ఒక తెల్ల చీర కట్టుకుని... Continue Reading →

మనసు విప్పిన మనసైన నేస్తం…


ఆయ్.. నమస్కారమండీ.. ఇక్కడ ఎదో జ్ఞాపకాల పోటీ జరుగుతుందట కదండీ.. అందుకే నేను ఒచ్చానండీ.. నా గురించి చేప్పుకుందాం అనీ. న్యాయంగా అయితే ఈ అమ్మడు వచ్చి "ఇదో.. ఇవీ నా జ్ఞాపకాలు" అని చెప్పాలండీ.. కానీ ఎక్కడండీ.. తను రావటం లేదండీ.. పైగా నన్ను తలుచుకోగానే మూలగడం మొదలెట్టుదండీ.. అందుకే నేనే చెపుదాములే అని వచ్చేశానండీ.. మొదలెట్టేయమంటారా అండీ?? నా పేరు "ఉత్తరం" అండీ.. ఆయ్!! అల్లా కాదండీ.. తూర్పూ..ఉత్తరం.. వాస్తు అవి కావండీ!! నేను... Continue Reading →

Alps Vs Bull


అర్జెంటుగా ఒక మంచుకొండను ఊహించుకోండి.. కళ్ళు మూసుకోకుండా!! "ఒక మంచు కొండ కష్టం అమ్మాయ్, ఎక్కడైనా పర్వత శ్రేణులుంటాయి గాని ఇలా ఒక్క కొండ.." అంటూ లాజిక్కులు వద్దు. ఒక కొండ ఉండాలి పూర్తిగా మంచుతో.. చూట్టూ ఏమి ఉన్నా ఎలా ఉన్నా ఈ కొండ దూరం నుండి చూసినా ప్రస్పుటంగా కనిపించాలి. అలాంటి ఓ మంచు కొండ దినదిన ప్రవర్దమానం చెందుతూ తన ఉనికి విశ్వానికి చాటుతుంది. ఎందరో వచ్చి దీన్ని ఢీ కొనాలి అని... Continue Reading →

స్వామీ, అతని మిత్రుల కథ చెప్పనా??


ఓసోస్.. ఆ కథా?? దాని గురించి మాకూ బోలెడు తెలుసు... స్వామీ అనే చిన్న కుర్రాడు.. మాల్గుడి అనే మనోహర పట్టణంలో తన తల్లిదండ్ర్రులతో ఉండేవాడు. ప్రాణప్రదంగా చూసుకునే ఒక బామ్మ కూడా.. నాన్న చలా స్ట్రిక్ట్.  అతగాడికి మణి, రాజన్ అనే స్నేహితులు ఉంటారు. వారితో అతని ఆటపాటలు, చిలిపి చేష్టలు, అమాయకపు భయాలు ఇవ్వనీ చదవని వారుండచ్చు.. చూడనివారుండొచ్చు. కానీ రెండూ చేయని వారి చాలా అరదు, అని అంటారా? సరే.. కాదనను.. కానీ... Continue Reading →

నువ్వు నువ్వుగా…


హే... ఏంటీ ఇది? ఇంత రాత్రి.. ఏం చేద్దాం అని? తొంగి చూడకు అలా... చెప్పాను కదా నీతో మాట్లాడలేనని.. ఇప్పుడు రానని.. అయినా వినిపించుకోవేం? చెప్తుంది నీకు కాదు.. అబ్బా.. అంతా వెలుతురు.. మసక వెలుతురు..వద్దన్నా తీసుకువస్తావు దీన్ని నీతో పాటు. ఒక్కడివే రావచ్చు కదా.. దీన్ని వెంటేసుకు తిగరడం దేనికి? నువ్వూ.. వీళ్ళలానే బాగా రుచిమరిగావు.. పొగడ్తలకీ, కవిత్వాలకీ. నిన్ను చూసి రాస్తున్నారనుకున్నావా.. అవ్వన్నీ.. కాదు నీతో పాటు వస్తుందే దీన్ని చూసి. "వెన్నెల... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: