మాట – మౌనం (వైట్ ఆండ్ బ్లాక్)


"వైట్ ఆండ్ బ్లాక్? అచ్చు తప్పు!" అని మీరనుకునే లోపు దాని పై ఓ రెండు ముక్కలు. బ్లాక్ ఆండ్ వైట్ లో బ్లాక్ ని వైట్ గా వైట్ ని బ్లాక్ గా చూపించడమే. అంటే పాత్రల రోల్ రివర్సల్ మాట!**************************************************************************ఆ ఊరిలో అన్ని కుటుంబాల్లానే అదీ ఒక కుటుంబం. చింతల్లేని కుటుంబమా? కాదా? అన్నది మున్ముందు తెల్సిపోతుంది, తొందర పడి ఓ మాటనేసుకుంటే మళ్ళీ అవ్వాక్కవ్వాల్సి రావచ్చు. ఆ కుటుంబంలో ఒక అమ్మా, ఒక... Continue Reading →

ఓడినా.. ఓడించినా..


నీ మీద గెలుద్దామంటే నీ ఓటమి నా ఓటమయ్యి కూర్చుటుంది. నేను ఓడిపోదామనుకుంటే నా ఓటిమికి నేను తప్ప దిక్కుండదు. ఓడిస్తూ నెగ్గలేక, నెగ్గుతూ ఓడిపోలేక ఈ ఆటను ఆడలేను. అలా అని వదలి వెళ్ళిపోలేను. ఆటలో ఆసక్తి హెచ్చేకొద్దీ గాయాలకీ అవకాశం పెరుగుతూ పోతుంటే నిన్ను కాపాడుకోవాలనే తాపత్రయానికీ నేను ఓడిపోకూడదన్న తపనకీ మధ్య "మనం" నలుగుతున్నాం. ఆ నలుగు నిగారింపుకే అనిపిస్తుంది ఓ పక్క. అనవసరపు ఒత్తిడి అనిపిస్తుంది మరో పక్క. పక్కకు తప్పుకోలేక,... Continue Reading →

మాట – మౌనం (బ్లాక్ ఆండ్ వైట్)


రాముడూ -భీమూడు", "సీతా ఆవుర్ గీతా" సినిమా లైన్స్ మీద "మాటా-మౌనం" (పేర్లల్లో ప్రాస కుదరకపోయినా) అనే బ్లాక్ ఆండ్ వైట్ చిత్రం ఉందనుకుందాం. అదెలా ఉంటుందంటే..*********************************************************************************మాటా - మౌనం తోడబుట్టినోళ్ళనుకుంటే, అప్పుడు మౌనం పెద్దక్క అన్నమాట. నోట్లో నాలుక లేనిది. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్ల రంగు కాటన్ చీర కట్టుకుని (వీలుంటే వీణ వాయిస్తున్న ఫోజులో) జుట్టుని గట్టి ముడిగా బిగించి ఓ రకమైన హుందాతనం, ఠీవి, రాజరికం, దైవత్వం లాంటి భారీ... Continue Reading →

నా క్షణాలు


మొన్న ఎవరో, "అబ్బో.. నువ్వు చాలా సీరియస్ మనిషివి. కాంప్లికేషన్స్ ఎక్కువ!" అనే సరికి మనసు చివుక్కుమంది ఒక్క క్షణం. ఆ మనిషి అలా అనడానికి కారణం తెలీగానే మాత్రం నవ్వాగలేదు. నేను నవ్వుతున్నానన్న విషయం గ్రహించిన మరుక్షణం మరో జ్ఞాపకం కళ్ళముందు కదలాడింది. ఆ మొన్నకు మొన్న మరెవరో, "మీరు చాలా సంతోషంగా గలగలాడుతూ ఉంటారు" అని అంటే, "అబ్బే లేదండీ! మీరు నన్ను చూసింది తక్కువ కాబట్టి అలా అనేస్తున్నారు కాని, నేను చాలా... Continue Reading →

Space


"అసలేమయ్యిందో చెప్తే కదా నాకు తెల్సేది? ఏం చెప్పకుండా అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా చెప్పు?" అమ్మ ఏదో అంటోంది ఇంకా.."please mom! will you go from here? I wanna my space" దుఃఖం, కోపం కలగలసిన గొంతుతో అరవాలనే అసఫల ప్రయత్నం చేశాను."ఎందుకూ? ఇంకా చిందర వందర చేసిపెట్టటానికా? నీకు ఒక గది కాదు, ఓ ఊరు రాసిచ్చినా సరిపోదు! ఆ పుస్తకాలు చూడు, అసలు చదువుతున్నావా వాటిని? ఎక్కడంటే అక్కడ అవే.... Continue Reading →

జ్ఞాపకాలతో నడక


"A walk to remember" సినిమాలో హిరోయిన్ "నాకు ఏక కాలంలో రెండు చోట్ల ఉండాలని కోరిక!" అని చెప్పినప్పుడు హీరో మామూలుగానే విని ఊరుకుంటాడు. కానీ ఉన్నపలనా ఒక రాత్రి ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్ళి నడిరోడ్డు మీద నుంచోబెట్టి, రోడ్డు పై నున్న లావాటి తెల్ల గీతకు రెండు వైపులా కాళ్ళు ఎడంగా పెట్టమని చెప్పి, అక్కడే ఉన్న బోర్డు చూపిస్తూ "చూడు.. నువ్విప్పుడు రెండు ప్రదేశాల్లో ఒకేసారి ఉన్నావు" అంటాడు. ఆ అమ్మి,... Continue Reading →

బొమ్మరిల్లు – నా సోది!


బొమ్మరిల్లు సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఉంది నా దృష్టిలో. ఈ సినిమాకి నేను నా స్నేహితులతో వెళ్ళాను. అది పేద్ద విషయం కాదు మామూలుగా అయితే! కానీ ఈ స్నేహితులు నాకు చాలా ప్రత్యేకం. "గానం పుట్టుక గాత్రం చూడాలా?" అన్నట్టు స్నేహం పుట్టకకు మనం గుడ్డి సాక్షులం అనుకుంటాను. కలిసి పంచుకునే క్షణాల్లో ఎప్పుడో చట్టుకున్న పుట్టేస్తుంది. అలా పుట్టిందని కొన్నాళ్లకి మనకే ఎరుకలోకొచ్చి, అప్పటి నుండి దాన్ని పెంచి పోషించే కార్యక్రమం పెట్టుకుంటాం -... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: