నీ మీద గెలుద్దామంటే నీ ఓటమి నా ఓటమయ్యి కూర్చుటుంది. నేను ఓడిపోదామనుకుంటే నా ఓటిమికి నేను తప్ప దిక్కుండదు. ఓడిస్తూ నెగ్గలేక, నెగ్గుతూ ఓడిపోలేక ఈ ఆటను ఆడలేను. అలా అని వదలి వెళ్ళిపోలేను. ఆటలో ఆసక్తి హెచ్చేకొద్దీ గాయాలకీ అవకాశం పెరుగుతూ పోతుంటే నిన్ను కాపాడుకోవాలనే తాపత్రయానికీ నేను ఓడిపోకూడదన్న తపనకీ మధ్య “మనం” నలుగుతున్నాం. ఆ నలుగు నిగారింపుకే అనిపిస్తుంది ఓ పక్క. అనవసరపు ఒత్తిడి అనిపిస్తుంది మరో పక్క. పక్కకు తప్పుకోలేక, పక్కపక్కన ఉండలేక ఎన్నాళ్ళీ ఘర్షణ? అంటే నా ఓటిమి నీదయ్యినప్పుడు. లేదా మరుపు నా మీద గెల్చినప్పుడు.
చాలా బాగుంది. ‘మరపు నా మీద గెల్చినప్పుడు’ అంటే అర్థం కాలేదు.. దేన్నైనా మర్చిపోవడమనా?
LikeLike
అవును..
కొన్ని ప్రత్యేక ప్రయత్నాలు లేకుండానే మర్చిపోతాము..
మరి కొన్ని కొంత ప్రయత్నంతో మర్చిపోతాము.
కొన్నింటిని మర్చిపోవాలని మనం చేసే ప్రతీ ప్రయత్నం విఫలమవుతూనే ఉంటుంది. అందుకంటే వాటిని మర్చిపోడానికి మనమే అంగీకరించము. అయినా కాలక్రమేణా అవి “మరుపు”కొస్తాయి, కనీసం మరుగున పడతాయి. అదే నేనా పదాల్లో ఉద్దేశ్యించిన అర్థం.
LikeLike
మరుపు గెలిచినా
అనుభవాలు అంతరాళాల్లో అట్లాగే ఉండిపోతాయి.
అధోజగత్తులో చేతనంగా కాకపోయినా ఉపచేతనంగా మిగిలిపోతాయి.
అవి అవిభాజ్య
నీలో ఒక భాగంగా
కాబట్టి…
ఓటమి గెలుపుల సృహలేకుండా నలగటం ముఖ్యం
మనం “మనం”గా మిగలటం ముఖ్యం.
LikeLike
హహహ.
LikeLike