పుస్తకం.నెట్ అట..


హే .. పుస్తకాలకి ఏదో సైట్ పెడుతున్నారట కదా?ఓ తెల్సిందా?! అవును.. పుస్తకం.నెట్ అనీ.. జనవరిలో ప్రారంభమవుతుందది.పుస్తక సమీక్షలూ గట్రా ఉంటాయా?ఊ..పుస్తక సమీక్షలూ అవీ అంటే అబ్బో బా చదివేవారికోసం కానీ..  సమీక్షలనే కాదు, పుస్తకాలతో ఏ చిన్ని అనుభవమున్నా అందులో రాసుకోవచ్చు. అనుభవాలా? అక్కడెందుకూ? బ్లాగులున్నాయి కదా!నచ్చిన పుస్తకమనో.. మెచ్చని రచననో ఆనందావేశాలలో రాసేసి బ్లాగుల్లో పెడతాం.  ఓ రెండ్రోజుల్లో అది మరుగున పడిపోతుంది. ఆ తర్వాత దాన్ని విశ్వప్రయత్నంతో వెతకచ్చనుకోండి.. అదే కొత్త వాళ్లకయితే... Continue Reading →

BRB…


madhurimak: ఓయ్య్.. ఉన్నావా? techie.kiran: ఉన్నా..madhurimak: ఏం చేస్తున్నావ్?techie.kiran: అమ్మాయి గారి రాక కోసం వేయి కళ్ళతో వేయిటింగ్ ఇక్కడ! madhurimak: అబ్బా.. ఛ! అంతుందా? techie.kiran: ఏంటి ఉందా? ఇదో BRB అని అంటూ వెళ్ళావ్.. ఎంత సేపటికీ రావేం?madhurimak: ఓహ్.. సారీ కిరణ్. లీడ్‍కి అప్‍డేట్ చేద్దామని వెళ్ళానా, ఇంకేదో టాపిక్ స్టార్ట్ అయ్యింది..మాట్లాడుతూ ఉన్నాం. అందుకే లేట్! అయినా నవ్వు విండో ఓపెన్‍గా పెట్టి, నా (రాక) కోసం దాన్నే  చూస్తూ ఉన్నట్టు... Continue Reading →

ఎడబాటు


శీతాకాలం సాయంత్రం; చలీ-చీకటీ పాత స్నేహితులైయ్యినట్టు చేతిలో చేయి వేసుకుని వచ్చాయి. "బై..టేక్ కేర్" అని చెప్పేక కూడా ఇంకా ఏవైనా మాటలు పుట్టుకొస్తాయేమో అని కట్ చేయకుండా ఇద్దరం వేచి చూసిన ఆ క్షణాల్లోని నిశ్శబ్ధంలోనే ఉన్నానింకా, ఫోన్ డిస్‍కనెక్ట్ చేసి ఐదు నిముషాలవుతున్నా! నా పరధ్యానాన్ని ఆసరా చేసుకుని కొంటె గాలి చుట్టూ చేరి నన్నల్లుకుపోయ్యింది. ఒక్కసారి ఉల్లిక్కిపడిన భుజాలకి చేతులను ఆసరా ఉండమని పురమాయిస్తే. అవి కాస్తా మృదువైన చున్నీ తగిలేసరికి కాసింత... Continue Reading →

Camకి చిక్కని చిత్రాలు!


గడచిన వారాంతంలో చేసిన ప్రయాణంలో డిజికామ్ అక్కరకు రాలేకపోయినా, మనోనేత్రంలో స్థిరపడిపోయిన కొన్ని ఛాయాచిత్రాలను అక్షరాలలోకి తర్జుమా చేసే ప్రయత్నం.  చూద్దామా మరి? అటో నక్షత్రమైన తీరు: మా వాళ్ళేదో కౌంటర్ వేశారు నా మీద అనిపించి పుస్తకంలో నుండి తేలి, వాళ్ళవంక రుసరుస చూద్దామని తలపైకెత్తా! తీరా చూస్తే కౌంటర్ పొట్లంలో పొగడ్త పెట్టారని గ్రహించి, నవ్వుకోలేక, నవ్వు ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకునేసరికి, వెన్నెలలో బయటంతా బూడిద రంగులో ఉంది. బూడిద కూడా కాదు,... Continue Reading →

నిరంతర మాటల స్రవంతి..


స్థలం: ఎఫ్.ఎం స్టూడియోసమయం: సాయంత్రం ఐదు గంటలుహల్లో.. ఆదాబ్.. నమస్కారం.. గుడ్ ఈవెనింగ్.. వచ్చేశాను.. వచ్చేశాను.. నేనొచ్చేశాను, సాయంత్రం అయిదవ్వగానే ఎవరు వస్తారు? వాన దేవుడు రానా వద్దా అని ఓ తెగ మొహమాటపడుతున్నాడుమనద్దగ్గర అలాంటి మొహమాటాలేం లేవుఅందుకే మీరు వెంటనే ఎస్.ఎం.ఎస్ చేసి, మీకు నచ్చిన పాటను రిక్వెస్ట్ అడగండి. నంబర్లు గర్తున్నాయి కదా? ఏదీ నాతో పాటు చెప్పండి.. బి.ఎస్.ఎన్.ఎల్ సబ్‍స్క్రైబర్స్ 8765 కి, ఏర్టెల్ హచ్ వాళ్ళు, 7765 కి, రిలయన్స్-4362 కి... Continue Reading →

పంచుకున్న ఆనందం..


కిక్కిరిసిన క్రికెట్ స్టేడియం అది. ఇంకా వేసవికాలం తన ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తూ కూడా తన తీవ్రతను రుచి చూపిస్తూనే ఉన్నాడు. స్టేడియం పడమటి సీటింగంతా ఇంకా వేడి పెనంలానే ఉంది. గుచ్చి గుచ్చి చూస్తున్న సూర్యుడిని తప్పించుకోడానికి  ప్రయత్నంగా చున్నీని తల మీద నుండి కప్పుకుంది వినీల. పల్చని తెల్లని షిఫాను నేత నుండి వెళ్ళి సూర్యకిరణాలు ఇప్పుడో కొత్త అందాన్ని సంతరించుకుని మరీ ఆమె మొహాన్ని తాకుతున్నాయి."లేదు రా... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: