Flush!


కడుపులో మెలితిప్పుతోన్న బాధ వల్ల పనిపై ఏకాగ్రత ఉన్నట్టు నటించటం కూడా వీలుపడ్డం లేదని గ్రహించింది ఆమె. మళ్ళీ రెస్ట్ రూంకేసి వెళ్తే, చూసే వాళ్ళు ఏమనుకుంటారోనన్న ఆలోచన ఆమెను సీటుకు అతుక్కునే చేసింది. ఇంతలో ఓ కొలీగ్ సీటు దగ్గరకు వచ్చాడు. చిన్న పనే కదా అని అతడితో మాట్లాడ్డం మొదలెట్టింది. రెండు నిముషాలు అనుకున్నది కాస్తా పావుగంటయ్యింది. బాధ తీవ్రత క్షణక్షణానికి పెరగటంతో ఆమె సీట్లోనే అసహనంగా కదులుతోంది. అతడింకా మాట్లాడుతూనే ఉన్నాడు. తన్నుకొచ్చేస్తోంది.... Continue Reading →

న్యాయం?!


ప్రియమైన ముఖ్యమంత్రిగారికి, నమస్కారాలు! ముందుగా, నా మాట మన్నించి నన్నో సురక్షిత ప్రదేశానికి తరలించి, నేను అజ్ఞాతంలో ఉండేలా చూసినందుకు మీకు వేలవేల నమస్కారాలు! ఈ ప్రపంచం నుండి కాపాడినందుకు మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలీడం లేదు. "మాటలకే కాదు తల్లీ, మౌనానికీ నానార్థాలూ, విపరీతార్థాలూ తీయగలదీ ప్రపంచం! నిన్ను మాట్లాడమని బలవతం పెట్టను. కాని నీ మనసేమిటో తెల్సుకోవాలనుకోవడం అవమానవీయం మాత్రం కాదు!" అన్న మీ మాటలు పదే పదే నా చెవుల్లో మ్రోగుతున్నాయి.... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

<span>%d</span> bloggers like this: