హైద్ లో ఓ సాయంత్రం, సముద్ర తీరాన!


కల కాదుగా నిజమే కదా, నిను చూస్తున్నా సంతోషమై కెరటానిగా పడి లేస్తున్నా నిజ జీవితంలో కూడా నేపధ్య సంగీతం పాటలూ ఉంటే, ఇలాంటి పాటలన్నీ ఏరుకుని మరీ "ప్లే" చేసుకోవాల్సిన సందర్భం అది నా జీవితంలో! నేను ఇన్నాళ్ళు చూడని, ఎప్పటికి చూస్తానో తెలియని "సముద్రం" నా కళ్ళముందు నిలవడం, ఒక మరుపురాని అనుభూతి. మా తొలి ముఖ పరిచయానికి కోవళం వేదికగా మారింది. నేనొచ్చానని తెలిసి సముద్రం మరీ ఉత్సాహంగా ఉరకలు వేస్తుందోమో అన్న... Continue Reading →

సూసైడ్ నోట్


విరక్తి! విరక్తి!! విరక్తి!!! ఈ లోకమంటేనే నాకు విరక్తి!! చేసే ప్రతీ చర్యకీ కారణం కనిపించాలంటూ వేధించే లోకమంటే విరక్తి!! పద్ధతులే పరమావధులుగా భావించి మనసు నోరు నొక్కేసే లోకమంటే విరక్తి!! కట్టుకున్న కట్టుబాట్లు అవి కప్పుతున్న శరీరాన్నే తూట్లు పొడుస్తున్నా చూసీచూడనట్టు ఉండే ఈ లోకమంటే విరక్తి!! నా పుట్టక నా ఇష్టానుసారం కాదు. పుట్టిన తర్వాత మెల్లి మెల్లిగా పాకుతూ, కొద్ది కొద్దిగా బలాన్ని నింపుకుంటూ, కాస్త కాస్తగా వేగాన్ని పుంజుకుంటూ ఉరకలు వేసే... Continue Reading →

తిలక్ కథలు – 1


ఓ శనివారం మధ్యాహ్నం పూట కోఠికి వెళ్ళాను, ఒక స్నేహం కొన్ని తెలుగు పుస్తకాలు కావాలంటే తీసుకొద్దామని. కావాల్సినవి కొని బయటకి వస్తుండుంగా, ఇరుగ్గుగా ఉన్న ఆ కొట్టులో, ఓ వ్యక్తిని దాదాపుగా గుద్దబోయి ఎలానో సంభాళించుకున్నాను. "క్షమించండి" ని నవ్వుగా మార్చి మాట కలిపాను. కొత్త పరిచయాలన్న బెరకు ఎటూ తక్కువ కాబట్టి ఏవేవో మాట్లాడుకున్నాము చాలా సేపు!! మధ్యలో "అతని" ప్రస్తావన వచ్చింది. "ఆ తెలుసులే..అయినా నాకవన్నీ పెద్దగా ఎక్కవు" అన్నట్టు విన్నాను. ఆయన... Continue Reading →

నిఝంగా క్రికెట్టేనా??


ఒకోసారి మనకి చాలా ఇష్టమైన వాళ్ళు, ఇష్టమైనవి మనకి ఇష్టమై ఉండకపోతే బాగుండేదేమో అనిపిస్తుంది. మనకున్న ఇష్టం వల్ల వెనకేసుకు రావటం కాదు అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి వస్తుంది, ఎవరూ నమ్మరని తెలిసినా!! ఇప్పుడే శివ గారి బ్లాగులో "ఒలింపిక్స్ లో వైఫల్యానికి కారణం ముమ్మాటికీ క్రికెట్టే కారణం"* అని చదివాకా, నిజంగానా? నిఝంగా నిజంగానా? అని అడగాలనుంది. కొన్ని నిజాలు లేకపోలేవు, కానీ అదే ప్రధాన కారణం అంటే నమ్మకంగా లేదు, క్రికెట్ట్ మీద వెర్రి... Continue Reading →

నాకింట్లోనే భయం వేస్తుంది.. డాడ్!!


"హలో.. చెప్పు నాన్న.." "హలో.. డాడ్, నాకు చాలా దాహం వేస్తుంది, మంచి నీళ్ళు కావాలి తాగటానికి!!" "ఏ రా కన్నా, మంచినీళ్ళు ఇవ్వాల కూడా రాలేదా? సరే.. ఇప్పుడే ఒక మినిరల్ వాటర్ కాన్ ఇంటికి వచ్చేలా చూస్తాను ఉండు" "అది కాదు, నీళ్ళున్నాయి. వంటింట్లోకెళ్ళాలి నీళ్ళు తాగాలంటే, నాకు భయం వేస్తుంది. కానీ చాలా దాహమూ వేస్తుంది" "భయం దేనికి? ఎందుకు?" "నిన్న సంఘటనా స్థలం అక్కడే కదా!! అందుకే వెళ్ళాలి అంటే భయం.... Continue Reading →

వీలైతే నాలుగు scrapలూ, కుదిరితే… ;-)


(ఆర్కుట్ లో ఇరువురి సంభాషణను చదవాలంటే, ఎంత ఇబ్బందో ఈ తరం వారికి వేరుగా చెప్పనవసరం లేదు. "ఇబ్బంది" ఇతరుల విషయాలు చదువుతున్నందుకు కాదు, అక్కడో మాట, ఇక్కడో మాటని కలిపి చదువుకోవాలి కదా.. అందుకు!! 😉  అందుకే నా స్నేహితుడితో జరిగిన ఆర్కుట్ స్క్రాప్స్ అన్నీ ఒక చోట, ఇలా) తను: ఏంటీ? ఎక్కడికి మాయమైపోయావు? కనబడడం లేదసలా? స్నేహాన్నే స్నేహించే అరుదైన స్నేహానికి, ఈ రోజే కాక ప్రతీ రోజు పండగ కావలని కోరుకుంటూ..... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑

%d bloggers like this: