Affectionately dedicated to HP Compaq 6720s

Alps Vs Bull

అర్జెంటుగా ఒక మంచుకొండను ఊహించుకోండి.. కళ్ళు మూసుకోకుండా!! “ఒక మంచు కొండ కష్టం అమ్మాయ్, ఎక్కడైనా పర్వత శ్రేణులుంటాయి గాని ఇలా ఒక్క కొండ..” అంటూ లాజిక్కులు వద్దు. ఒక కొండ ఉండాలి పూర్తిగా మంచుతో.. చూట్టూ ఏమి ఉన్నా ఎలా ఉన్నా ఈ కొండ దూరం నుండి చూసినా ప్రస్పుటంగా కనిపించాలి.

అలాంటి ఓ మంచు కొండ దినదిన ప్రవర్దమానం చెందుతూ తన ఉనికి విశ్వానికి చాటుతుంది. ఎందరో వచ్చి దీన్ని ఢీ కొనాలి అని చూసినా విఫలమై వెనుతిరిగిపోతున్నారు. చూసిన వారికి అమితానందాన్ని ఇస్తుంది ఆ కొండ. చల్లగా, హాయిగా, అహ్లాదంగా, అంత కన్నా అనుకువగా చూసేకొద్దీ చూడాలనిపించే పర్వతం, జగత్తునే తన మాయాజాలంతో మొహితం చేస్తూ.

అప్పుడే ఓ ఎద్దు..  భీకరమైన గాంభీర్యంతో, full of raw energy తో ఆ కొండ ఢీకొట్టింది. మెదడు బొప్పికట్టింది. తిరిగి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి వచ్చింది.. మళ్ళీ ఢీ అంది.. మళ్ళీ ఓడిపోయింది. అయినా పట్టు విడవలేదు.. అంతకు ముందున్న raw energy ని polished talent గా మార్చుకుంది. ఈ సారి కొండలోని ప్రతీ బలహీనతనూ చూసికొడుతోంది. నిశ్చలంగా ఉండే కొండ కొద్దిగా కదులుతోంది.. ఎద్దు బలాన్ని పుంజుకుంటుంది. వారిద్దరి మధ్యా భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఎవరిదో ఒక్కరిదే ఆ గెలుపు.. ఎవరో ఇంకొంత సేపులో తెలిసిపోతుంది. ఎవరు గెలుస్తారు అన్నది పక్కకు పెడితే… వీరిద్దరూ యుద్ధానికే కొత్త అర్ధం తెస్తున్నారు.

Serious sport is nothing but war minus shooting అన్న George Orwell quote ని ఈ క్షణాన యాధాతధంగా ఆపాదిస్తే నేను చెప్పిన ఊహలో ఆ పర్వతం రోజర్ ఫెడరర్… ఎద్దు రఫా నదాల్!!* విరిద్దరి పోరు వింబుల్డన్ చరిత్రలోనే కొత్త ఆనందాన్ని అందిస్తుంది.

వీరిరువురు గురించి తెలియని వారికి: రోజర్ ఫెడరర్.. Switzerland దేశస్థుడు. అచ్చు అక్కడుండే ఆల్ప్స్ పర్వతాల్లా.. చల్లగా, హాయిగా, మనోహరం.. హుందా గా ఉంటుంది ఇతని ఆటతీరు. టెన్నిస్ ప్రపంచాన్ని ఒక ఊపు ఊపుతున్నాడు. Class act అన్న ఆంగ్ల పదానికి నిలువెత్తు మనుష్యాకారం రోజర్!! ఈ అబ్బి ఆట చూడాల్సిందే కానీ మాటలు వెత్తుక్కోవటం చాలా కష్టం.

ఇక నదాల్ స్పేన్ దేశస్తుడు. ఆ దేశ జాతీయ క్రీడ ఎద్దుల పోటీ (bull fight) ఆ ఎద్దుల పోటీ చూసే ధైర్యం నాకెటూ లేదు. కానీ రఫా రఫ్ ఆడించే విధానం చూస్తే మాత్రం ఒక ఎద్దు రెచ్చిపోతే ఎంత ప్రమాదకరమో అర్ధమవుతుంది. ఆ దూకుడు, ఆ పట్టు వదలని ప్రయత్నం, ఆ దీక్ష, అతి వేగంగా కోర్టును మొత్తం కలయచూట్టే movements, ఆ bull’s eye లక్ష్యం.. తన incredible angles తో ఆటకే కొత్త అందం తెచ్చాడు.

ఈ అబ్బాయిలిద్దరూ నువ్వా నేనా అన్నట్టు గా ఆడతారు.. ఎలా అయినా ఆట చూసి “రోజర్ రాక్స్” అనో.. “రఫ్ ఆడిన రఫా” అనో టపాయించాలి అనుకున్నా. దాదాపు నాలుగు గంటలనుండి ఎవరు గెలుస్తారా అని చూస్తున్న. కానీ వారి ఆట చూశాకా.. మనసు మారింది. ఎవరు గెలుస్తారో అది వారి అదృష్టం. కానీ చూసిన ప్రతీ వారికీ ఊపిరి బిగపెట్టాల్సిన అంత ఉద్రేకంగా ఆడిన వీరికి నేను చెప్పాలనుకున్నది ఒక్కటే మిగిలింది:

Take a Bow, guys!!

మానసికంగా శారీరకంగా వీరంతే ఆరోగ్యకరంగా ఉండి.. మనకి మరిన్ని సంగ్రామాలను అందించాలని కోరుకుంటున్నాను.

My addiction to sports has been due to some incredible men and women on the field. Now, whom do I attribute my new addiction.. blogging to?? 😉

అన్నట్టు మన బ్లాగ్లోకంలో ఓ కొత్త ఊరు వెలసింది చూశారా?? వింబుల్డన్ విలేజ్!!

* It was just a comparison. No offence meant towards any individuals!!

14 Responses to “Alps Vs Bull”

 1. independent

  Yes Poornima, naku kooda oka epic match ni choosina santruptini miglchindi ee match. I was rooting for Federer, but I am still happy though.

  Meeru valliddariki aapadinchina upamanalu matramu chala adbhutam. Emotions eppudu display cheyani Roger, eppudu aggressive ga kanipinche Nadal ni, and vallidari madhyalo unna potini amoghanga varnincharu. I fell for it. I couldn’t have thought better. Kudos.

  Like

  Reply
 2. కత్తి మహేష్ కుమార్

  ప్రేమ లేఖలు, భావ కవితలూ, పుస్తక సమీక్షలు, స్పోర్ట్స్ విశ్లేషణ…ఎదైనా నీ శైలి నీదే! చదివిస్తావ్, నవ్విస్తావ్, ఆశ పెడతావ్,అధారిటీ చూపిస్తావ్ బాగుంది. ఇంకా నీ నుంచీ మరిన్ని టపాలు ఆశిస్తూ…

  Like

  Reply
 3. మేధ

  నేను ఈ మ్యాచ్ చూడడం మిస్స్ అయ్యాను..
  నాకు మొదటినుండీ ఫెదరర్ అంటే ఇష్టం.. అలాగని నాదల్ అంటే కోపం మాత్రం కాదు.. ఫ్రెంచ్ ఓపెన్ లో మాత్రం అతనే గెలవాలని కోరుకుంటూ ఉండేదాన్ని…
  కానీ ఈ సారి నాదల్ రికార్డు సృష్టించాడు కదా, కాబట్టి ఫెదరర్ కి కూడా ఆ ఛాన్స్ రావాలి అనుకుంటూ ఉన్నాను కానీ, ఈ రోజు ప్రొద్దున్నే లేచి పేపర్ చూసేసరికి నాదల్ చేతిలో ఉంది ట్రోఫీ…. ఫెదరర్ గెలవనందుకు బాధగా ఉన్నా, గెలించింది నాదల్ కాబట్టి వాకే!.
  మీ టపా చూసిన తరువాత తెలిసింది నేను చాలా మంచి మ్యాచ్ మిస్స్ అయ్యాను అని.. 😦

  Like

  Reply
 4. వేణూ శ్రీకాంత్

  పూర్ణిమా ఏం రాసినా ఇంత ఇంట్రెస్టింగా ఉండేలా ఎలా వ్రాయగలుగుతున్నారండి. నాకు స్పోర్ట్స్ లో ఇంట్రస్ట్ చాలా తక్కువ మీ టపా టెన్నిస్ గురించి అని తెలియగానే ఆపేస్తానేమో అనుకున్నా కానీ చివరి వరకు చందివించేసారు 🙂

  Like

  Reply
 5. పూర్ణిమ

  @Independent:
  నిన్న రాత్రి దాదాపు నిద్రపోతూ రాసిన టపాకి ఇంత అందమైన అభినందన పొందితే.. నా రోజు ఎలా గడిచిందో మరలా చెప్పకరలేదు. Your comment has boosted my writeup.

  సుజాత: నాకూ రాజరే ఇష్టం. టఫ్ లక్!! 😦

  మహేశ్ గారు: నేనింకా మిమల్ని ఏడిపించలేదు మాట.. సరే అయితే ఇక అదే పని మీద ఉంటా!! 😉

  మేధ గారు: Sorry.. u did miss an epic match!! 😦

  వేణూ గారు: ఇంటెరస్ట్ ఉన్నా లేకపోయినా, నచ్చినా నచ్చకపోయినా మీలా ప్రోత్సహించేవారుండగా.. అదే నాకు కొండంత బలం.

  Like

  Reply
 6. ప్రవీణ్ గార్లపాటి

  నదల్ కి వీరాభిమానినే నేను…
  గెలిచినందుకు భలే సంతోషం. కోటలో పాగా కదా మరి 🙂

  Like

  Reply
 7. ఆనందం

  నరాలు తెగాయి నాక్కూడా. ఫెదరర్ ఈ ఇయర్లో ఓ స్లాం గెలవకపోతే నాకు ఏడుపొచ్చేట్లుంది.

  Like

  Reply
 8. ఏకాంతపు దిలీప్

  @పూర్ణిమ
  ఇలా రాయడం నీకే సాధ్యం! 🙂

  Like

  Reply
 9. పూర్ణిమ

  ప్రవీణ్ గారు: కాస్త ఆగండి.. మా రోజరూ వేస్తాడు త్వరలో పాగా 🙂

  ఆనంద్ గారు: ఇంకా యు,ఎస్ ఉంది కదా?? ఎప్పుడేనా?? అయినా రోజర్ ఫార్మ్ లోకి వస్తే స్లాములు ఒక లెక్కా చెప్పండి.

  దిలీప్ గారు: నెనర్లు 🙂

  Like

  Reply
 10. అబ్రకదబ్ర

  ఈ ఆటతో అమెరికా ఓపెనూ అనుమానమే. పాపం గాయాలు పూర్తిగా తగ్గినట్లు లేవు. ఈ ఏడాదికి ఫెదరర్నొదిలేయండి. వచ్చే ఏడాది జూలు విదిల్చిన సింహంలా మళ్లీ విజృంభిస్తాడు చూడండి.

  మన్లో మాట, నాకు ఫెదరర్ని చూసినప్పుడల్లా సల్మాన్ ఖాన్ పెద్ద తమ్ముడు అర్బాజ్ ఖాన్ గుర్తొస్తాడు. ఇద్దరికీ చాలా పోలికలు కనిపిస్తాయి – separated at birth లాగా. మీకెవరికన్నా అనిపించిందా?

  Like

  Reply
 11. శాంతి

  ఆల్ప్స్ – బుల్ పోలిక చాల బాగుంది. మేము కూడా మొత్తం మ్యాచ్ చూసాము. రోజర్ ఇది గెలిస్తే రికార్డు సృష్టిస్తాడని, అది మన కళ్ళ ఎదురుగానే జరిగిందని పోయేవరకూ చెప్పుకోవచ్చని ఆశ పడ్డాము. కాని, మీరు చెప్పినట్టు నడాల్ రోజర్ ని సవాలు చేసి గెలవడం చాల amazing గా అనిపించింది. ఐతే, మొదటి రెండు సెట్లు ఓడిపోయినా, పట్టుదల తో తిరిగి మ్యాచ్ ని గెలిచే వరకు తీసుకొని రావడం రోజర్ పోరాట పటిమని చూపిస్తుంది. నడాల్ నేమ్మదిగానైనా, రోజర్ ని ప్రతీ surface మీద సవాల్ చేసే స్థాయి కి ఎదగడం చాలా బాగుంది. USOpen సిరీస్ (వచ్చే రెండు నెలల లో US లో జరగబోయే ATP tournament లు అన్నీ) అంతట్లోను, రోజర్ కి నడాల్ pressure వుంటుంది. వింత గా అనిపిస్తుంది గని, నడాల్ అసలు టెన్నిస్ సీన్ లో లేకపోతె రోజర్ కి ఎదురు నిలిచే మగవాడు ఇంతవరకు కనిపించేవాడు కాదు. ఇటుపై రాబోయే ఒకటి రెండు సంవత్సరాలు వీళ్ళ పోరు కనులకు ఇంపుగా, గుర్తు వుంచుకోదగ్గగా వుంటుందనడంలో సందేహం లేదు.

  Like

  Reply
 12. పూర్ణిమ

  అబ్రకదబ్ర గారు: ఈ ఆటతో నిజమే.. కానీ త్వరలో ఫార్మ్ లోకి వస్తాడని కొండంత ఆశతో ఉన్నా.. మీరు మరీ అలా అనేయకండి.

  శాంతి గారు: నెనర్లు!! మీ వ్యాఖ్య చూశాకా ఇప్పటికిప్పుడు ఇంకో టపా రాయాలనిపిస్తుంది. మీరన్నది నిజమే.. నదాల్ అత్భుతమే.. కాకపోతే రోజర్ ఆట తగ్గింది కాస్త. వీళ్ళిద్దరూ టాప్ లో ఉన్నంత వరకూ మనకు పండగే!!

  Like

  Reply

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Basic HTML is allowed. Your email address will not be published.

Subscribe to this comment feed via RSS

%d bloggers like this: